మోహన్ బాబు ఇంట్లో విషాదం..
నటుడు మోహన్ బాబు కుటుంబంలో విషాదం నెలకొంది. మోహన్ బాబుకి సోదరుడైన రంగస్వామి నాయుడు (63) బుధవారం గుండెపోటుతో మరణించారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ ఆయన కన్నుమూశారు. రైతు అయిన రంగస్వామి నాయుడు.. తిరుపతిలో నివాసం ఉంటారు. తన అన్నయ్య మోహన్ బాబు చేపట్టే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆయన భార్య పేరు కాంతమ్మ. రంగస్వామి నాయుడు మృతి గురించి తెలుసుకున్న పలువురు రైతులు, ఆయన చిన్ననాటి స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. గురువారం తిరుపతిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Also Read: గుండెపోటుతో మరణించిన ప్రముఖ నటుడు..
పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల కార్డియాక్ అరెస్ట్‌తో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్తతో అభిమానులు, కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. పునీత్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వేలమంది అభిమానులు పునీత్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఇదిలాఉండగా.. తాజాగా పునీత్ భార్య అశ్విని ఇన్స్టాగ్రామ్ లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో లేని ఆమె తొలిసారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఓపెన్ చేసి తన తొలిపోస్ట్ ను పునీత్ కి అంకితమిచ్చింది.
పునీత్ అకాల మరణం కుటుంబసభ్యులకు కాదు.. మొత్తం కర్ణాటక ప్రజలకు షాకింగ్ గా ఉందని.. ఆయన అభిమానులకు పునీత్ లేని లోటు ఊహించడం కష్టమే అని అన్నారు. ఈ బాధలో మనోనిబ్బరంగా, ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలకు పాల్పడకుండా.. గౌరవంగా పునీత్ కు వీడ్కోలు పలికారని చెప్పారు. అప్పుని ఫాలో అవుతూ.. చాలా మంది నేత్రదానానికి ముందుకు రావడం, మీ మనసులో ఆయనకున్న స్థానం చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయని రాసుకొచ్చారు అశ్విని.
Also Read: పవన్ ని ఒప్పించడానికి దిల్ రాజు ప్రయత్నాలు..
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్