దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు.. ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయని సీఎం జగన్ అన్నారు.   ప్రభుత్వానికి అండగా ఉన్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.  మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు చెప్పారు.






కుప్పం అడ్డాలో చంద్రబాబు పరాజయం పాలయ్యారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం వచ్చిన ఫలితాల్లో కుప్పం మున్సిపాలిటీని  వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుందన్నారు. చంద్రబాబుకు కుప్పం ప్రజలు తుది వీడ్కోలు పలికారని ఎద్దేవా చేశారు. కుప్పం ప్రజలు బాబుకు దండం పెట్టేశారని విమర్శించారు. పారదర్శకంగా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారని సజ్జల అన్నారు. 


సమయం గడిచే కొద్దీ.. సీఎం జగన్ పాలనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని సజ్జల అన్నారు. బద్వేల్ ఎన్నికల్లోనూ టీడీపీ.. బీజేపీకి మద్దతు పలికినా అందరూ ఏకమైనా ఆ మెజారిటీ వచ్చిందని చెప్పారు. 2019లో 50శాతం ఓట్లతో ప్రారంభమైన యాత్ర ఇప్పుడు 90 శాతాన్ని మించిందని సజ్జల చెప్పారు. దౌర్జన్యాలు జరిగినట్లు చూపించాలని నానా యాగీ చేశారని, ఎదో విధంగా అలజడి సృష్టించి ఎన్నిక ఆపాలని చూశారన్నారు. గుంటూరులో ఒక డివిజన్ గెలిచామని పండగ చేసుకుంటున్నారని, కళ్లు మూసుకుని తమదే విజయం అంటుంటే జాలి పడాల్సిందేనని సజ్జల ఎద్దేవా చేశారు.






Also Read: AP Results : మినీ లోకల్ వార్‌లో వైఎస్ఆర్‌సీపీ హవా .. ఉనికి చాటుకున్న టీడీపీ ! పూర్తి ఫలితాలు ఇవే !


Also Read: TDP Reaction On Result : అసెంబ్లీ రద్దు చేసి మళ్లీ గెలిస్తే టీడీపీ రద్దు ..వైఎస్ఆర్సీపీకి టీడీపీ సవాల్ !


Also Read: Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ అదుపులో శివశంకర్ రెడ్డి


Also Read: AP BJP : ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ? ఏపీ బీజేపీ నేతలకు చివరి చాన్స్ !?


Also Read: CM Jagan: విద్యాశాఖపై సమీక్ష.. ఎయిడెడ్ పాఠశాలలపై కామెంట్ చేసిన సీఎం జగన్