" బీజేపీ ఏపీలో ప్రభుత్వానికి మిత్రపక్షం కాదు. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న వైసీపీని విడిచిపెట్టొద్దు. రాజధాని రైతుల యాత్రలో ఎందుకు పాల్గొనడం లేదు ?" అని సూటిగా ఘాటుగా అమిత్ షా తిరుపతిలో పొలిటికల్ పోస్టుమార్టం చేసేశాక ఏపీ రాజకీయాల్లో ఒక్కటే ప్రశ్న. ఏపీలో బీజేపీకి భవిష్యత్ ఉందా ? ఆ పార్టీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తే నిలబడగలుగుతుందా ? అసలు ఆ పార్టీ కంటూ ఓ వ్యూహం ఉందా..?


Also Read : నెల్లూరులో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్..కనీస పోటీ ఇవ్వలేకపోయిన టీడీపీ !


విభజన హామీలు నిలబెట్టుకోలేదన్న ఇమేజే మొదటి మైనస్..! 


ఏపీ బీజేపీకి ప్రధాన అడ్డంకి విభజన హామీల విషయంలో మాట నిలబెట్టుకోలేదన్న అభిప్రాయమే.  పార్టీ ఇమేజ్ అంతంత మాత్రం. పైపెచ్చు యూపీ నుంచి ఎంపికైన జీవీఎల్, ఏపీలో గ్రౌండ్ రియాలిటీ తెలియని దేవధర్ లాంటి నాయకులు ఏనుగుల్ని వదిలేసి ఎలకల్ని పట్టినట్టు మాట్లాడే తీరు బీజేపీని తీసికట్టు పార్టీగా చేసేసింది. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది కేంద్రం. ఆ తర్వాత హోదా లేదు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఇదే బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. 16 వేల కోట్లకుపైగా నిధులు ప్రామిస్ చేసింది. వాటితోపాటు ఇస్తామన్న సంస్థలు, తీసుకుంటామన్న చర్యలు, చేస్తామన్న పనులూ చాలానే ఉన్నాయ్. రాజకీయంగా 2017 తర్వాత ఏం జరిగిందో ఏమో అడుగు ముందుకు పడలేదు. పైగా ఇప్పుడు విశాఖ ప్రైవేటీకరణ, పోలవరం ప్రాజెక్టు పడక వేయడం లాంటి పరిస్థితులు వచ్చాయ్. అంటే కేంద్రం రంగంలోకి దిగి చక్కదిద్దాల్సిన సందర్భం ముందెన్నడూ లేనంతగా ఉంది ఏపీలో !


Also Read : కుప్పం ఓటమిని అంగీకరించి రాజకీయాల నుంచి వైదొలగాలి .. చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సూచన!


ఏపీ బీజేపీకి మొదటగా కావాల్సింది బలమైన నాయకత్వం !   


ప్రభుత్వ వ్యతిరేకతను మీరు పట్టుకోలేకపోతున్నారు.. అని అమిత్‌ షా చెబుతున్నారు అంటే రాష్ట్రానికి ఏం కావాలన్న విషయాలను స్థానిక నాయకత్వం అడ్రెస్‌ చేయలేకపోతుందనుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ఫస్ట్‌ అనుకునే నాయకత్వం ఉండాలి. ఏపీకి ఏం కావాలో ఆలోచించే నాయకత్వం ముందుకు రావాలి. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల నుంచి గట్టెక్కించే వ్యూహం ఉండాలి. సమస్యలకి మా దగ్గర ఇవిగో ఈ పరిష్కారాలు ఉన్నాయ్ అని చెప్పి ఒప్పించి, జనాన్ని మెప్పించే నేర్పు, ఒడుపు ఉండాలి. అన్నిటికీ మించి అలాంటి నాయకత్వానికి ఇమేజ్ ఉండి తీరాలి.  రెండేళ్ల కిందటి వరకూ... వైసీపీ తిరుగులేని స్థాయిలో ఉంది. ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వ విధానాలపై వివిధ వర్గాల్లో వ్యతిరేకత ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక.. "అభివృద్ధి ఆగిపోయింది... కొత్త సమస్యలు వచ్చాయి" అని  భావించే కొన్ని వర్గాలు..   ఆ సమస్యలకు.. పరిష్కారం చూపగలిగే నాయకత్వం ఉందా అని చూస్తారు. ఒక పార్టీగా బీజేపీ బలంగా లేకపోయినా... కేంద్రంలో తిరుగులేని స్థానంలో ఉన్న ప్రభుత్వంగా.. బీజేపీ ఆంధ్రాకు "ఏమైనా" చేయగలదు.  ప్రభుత్వం ద్వారా రాష్ట్ర సమస్యలకు భరోసా ఇప్పించగలం అన్న నాయకత్వం ఉంటే.. ఫలితం ఉంటుంది. అలాంటి నాయకత్వం లీడ్ తీసుకున్నప్పుడు చెప్పే మాటకు వేల్యూ వస్తుంది. దానికి తోడు పటిష్టమైన కర్యాచరణ కంపల్సరీ. ఏపీ కోసం మేం ఇవి చేస్తాం. ఇదిగో ఇవి ఇచ్చాం అని చెప్పడంతోపాటు చేతల్లో చూపించగలగాలి.


 



 


Also Read : గవర్నర్ బిశ్వభూషణ్‌కు అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు !


రాజకీయంగా పాతుకుపోవాలంటే ఇప్పుడే మంచి చాన్స్ !


రాజకీయాల్లో అవకాశాలు అరుదుగా వస్తాయి. అలా వచ్చినప్పుడు దూసుకెళ్తేనే పట్టు చిక్కుతుంది. ఇప్పుడు ఏపీలో బీజేపీకి ఆ చాన్స్ వచ్చింది. ఏపీ కష్టాల్లో ఉంది. గట్టెక్కిస్తామని ముందుకు రావాలి. కేంద్రం పరిధిలో ఉన్నంత వరకూ చేసి చూపించాలి. ఇదే అదునుగా బీజేపీ రంగంలోకి దిగి పని మొదలు పెడితే ఫలితం ఉండొచ్చు. విశాఖ ఉక్కు విషయంలో ఏం చేస్తారో చెప్పాలి. పోలవరం కట్టే బాధ్యత నెత్తికెత్తుకోవాలి. కేంద్రం నిధులతో రాష్ట్రంలో ఏమేమి చేయాలో దగ్గరుండి చూసే యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. మళ్లీ ఆ సొమ్ము కూడా పప్పుబెల్లాలు కాకుండా కాపాడుకుంటూ జనంలో విశ్వాసం కల్గించగలగాలి. అలాంటివన్నీ జరగాలి అంటే స్థాయి, తలంపు, నేర్పు ఉన్న నాయకత్వం ఉండాలి.


Also Read : ఓ ప్రజాప్రతినిధి నిర్వాకం... కుమార్తె పెళ్లికి కానుకలు సమర్పించాలని హుకూం... వైరల్ అవుతున్న వీడియో..!


ఏపీలో పరిస్థితులే బీజేపీకి పెద్ద అవకాశం ! 


అసలు బీజేపీ వైపు చూసే పరిస్థితి అప్పుడు అయినా వస్తుందా ? రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడు ఓ పార్టీ చేస్తున్న తప్పులు రెండో పార్టీకే కలిసి వస్తాయ్ కదా - అనొచ్చు. నిజమే ! కానీ, ఏపీలో పరిస్థితులు వేరు. శాంతిభద్రతల సమస్య ప్రబలంగా ఉందన్న వాదన హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ ఉంది. మినీ లోకల్ ఎన్నికల్లో కూడా నామినేషన్లు వేయనివ్వడం లేదు అనే గగ్గోలు పుడుతోంది అన్నివైపులా. అంటే వ్యతిరేకత ఒక్కటే సరిపోదు. అలాంటి పరిస్థితులకు ఎదురు నిలవాలంటే కేంద్రం దన్ను తప్పనిసరి. యంత్రాంగం మొత్తం రాష్ట్రం చేతిలోనే ఉన్నా, అడుగడుగునా ఆటంకాలు సృష్టించినా నేను నెగ్గుకురావడానికి, జనం నావైపు ఉన్నారు అని నిరూపించుకోవడానికి నాకు కేంద్రంలో ఉన్న బీజేపీ అవసరం అయ్యింది అని తెలంగాణ ఉప ఎన్నికలో గెలిచిన ఈటల రాజేందర్ చెప్పిన మాట తెలుగు రాష్ట్రాలకు అర్థం అయ్యింది. అంటే, జనసేన జోడీగా ఉన్న బీజేపీ నిక్కచ్చిగా తల్చుకుంటే, నిఖార్సుగా నాయకత్వాన్ని ముందు పెట్టి రంగంలోకి దిగితే ఇదో అవకాశమే అనుకోవచ్చునేమో !


Also Read : ఓ ప్రజాప్రతినిధి నిర్వాకం... కుమార్తె పెళ్లికి కానుకలు సమర్పించాలని హుకూం... వైరల్ అవుతున్న వీడియో..!


పైన అండ ఉంది.. కావాల్సింది ఏపీ నాయకుల్లో చిత్తశుద్దే ! 


పార్టీకి అవకాశం అంటూ ఉంటుంది అనిపించినప్పుడు పాత ముద్రలు కడుక్కోవడం, కొత్త గుర్తింపు తెచ్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. పైగా గెలిచే ఛాన్సు ఉందీ అన్నప్పుడు నాయకులు వలస కట్టడం ఎప్పుడూ ఉంటుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని ముఖ్యమంత్రుల్ని చేస్తున్నాం మనం. ఇలాంటప్పుడు పక్క పార్టీల నుంచి వచ్చిన నాయకులకి ప్రాధాన్యం ఇస్తే తప్పేంటి ? అని తిరుపతిలో అమిత్ షా చేసిన కామెంట్ ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పే అవకాశాలు కొట్టిపారేయలేం. కాకపోతే కార్యాచరణే కీలకం.


Watch Video : కోటి గెలుచుకున్న Raja Ravindra చెప్పిన ఆసక్తికర విషయాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి