ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఉన్న పళంగా ప్రత్యేక విమానంలో  హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని  ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ.. ఏఐజీ ఆస్పత్రిలో గవర్నర్‌కు చికిత్స అందిస్తున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గవర్నర్ వయసు 87 ఏళ్లు. వార్ధక్యం కారణంగా ఆయనకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో ఆయనను ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. 


Also Read : ఓ ప్రజాప్రతినిధి నిర్వాకం... కుమార్తె పెళ్లికి కానుకలు సమర్పించాలని హుకూం... వైరల్ అవుతున్న వీడియో..!


గత వారం రాష్ట్రపతితో జరిగిన గవర్నర్ల సదస్సు కోసం మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి తిరిగి వచ్చారు బిశ్వభూషణ్ హరిచందన్. తిరిగి వచ్చినప్పటి నుంచి స్వల్పంగా కరోనా లక్షణాలతో బాధపడ్డారు. దీంతో రాజ్ భవన్ వైద్యులు ఆయన ఆరోగ్య స్థితిని పరిశీలించారు. ఒక్క రోజు గడిచినా తగ్గకపోవడంతో  ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. ఆ మేరకు వెంటనే ప్రభుత్వ వర్గాలకు సమాచారం ఇవ్వడంతో అధికారులు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. హుటాహుటిన ఆయనను హైదరాబాద్ తరలించారు. అక్కడ కరోనా పరీక్షల్లోపాజిటివ్‌గా తేలింది. ప్రముఖ వైద్యుడు జి.నాగేశ్వరరెడ్డి బృందం గవర్నర్  బిశ్వభూషణ్‌కు వైద్య చికిత్స అందిస్తున్నారు.


Also Read: AP Mlc Elections: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల... నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ


అయితే గవర్న్‌కు అస్వస్థత, హైదరబాద్ తరలింపు అంశాలపై ఇంకా రాజ్ భవన్ కానీ ఏపీ ప్రభుత్వం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతనే గవర్నర్‌ అస్వస్థతకు కారణం ఏమిటన్నదానిపై స్పష్టత వస్తుంది.  రాజ్ భవన్ వర్గాలు ఈ అంశంపై స్పందించడానికి సిద్ధంగా లేవు. ఆస్పత్రి నుంచి ఏ క్షణమైనా హెల్త్ బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది.


Also Read: Minister Kannababu: మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పడి తీరుతాయి.. త్వరలో చూస్తారు


రెండు తెలుగు రాష్ట్రాలకు గతంలో ఉమ్మడి గవర్నర్ ఉండేవారు. ఏపీకి ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించిన తర్వాత తొలి సారి బిశ్వభూషణ్ హరిచందనే నియమితులయ్యారు. ఒడిషాకు చెందిన ఆయన సీనియర్ బీజేపీ నేత. 


Also Read : వంద నోటు ఉంటేనే టమోటా కొనేందుకు వెళ్లండి.. లేకుంటే రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని ఇంటికి వచ్చేయండి


Also Read: AP Highcourt : అమరావతి ప్రజలందరి రాజధాని.. విచారణలో హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు !


Also Read : ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్లు.. ఈ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రర్ చేసుకోవచ్చు.. డబ్బులు ఎంతంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి