దేశంలోనే తొలిసారిగా వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్లను వినియోగించుకునేందుకు ఆశావహుల నుంచి అభ్యర్థనలను స్వీకరిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్ల (WFHT) లో పని చేసుకునేందుకు ప్రత్యేక వెబ్ సైట్ ను ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వెబ్ సైట్ ప్రారంభించారు. 


WFHTలో పనిచేసుకోవాలనుకునేవారు 99888 53335 నంబర్ కి ఫోన్ చేసి, లేదా www.apit.ap.gov.in/wfht/ వెబ్ సైట్ లో కూడా తమ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. డిమాండ్ ని బట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్లలో పనిచేసుకునే అవకాశాన్ని సదరు ఉద్యోగులకు ప్రభుత్వం కల్పిస్తుంది. 


ప్రత్యేకతలేంటి..?
24 గంటల కరెంట్, హై స్పీడ్ ఇంటర్నెట్, మంచి ఆఫీస్ వాతావరణం, చైర్లు, ఇతర సదుపాయాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవారికి ప్రధానంగా పల్లెటూళ్లలో ఇంటర్నెట్ సమస్యలుంటాయి. ఒకవేళ నెట్ అందుబాటులో ఉన్నా కరెంటు సమస్యలుంటాయి. అలాంటివారందరికీ WFHT సెంటర్లు బాగా ఉపయోగపడతాయి. ఒక్కో కేంద్రంలో కనీసం 30 మందికి సీటింగ్ అరేంజ్ మెంట్ ఉంటుంది. అచ్చం ఐటీ ఆఫీస్ లాగే ఇంటీరియర్ ఉంటుంది. 


ఎక్కడెక్కడ ఉన్నాయి..?
రాష్ట్రవ్యాప్తంగా 29 చోట్ల ఇంజనీరింగ్ కాలేజీలు, విశాఖ, కాకినాడ, తిరుపతి ప్రాంతాలలో ఏపీఎస్ సెంటర్లలో 30 మంది కూర్చుని పని చేసుకునే వీలుగా ఈ వర్క్ ప్రమ్ హెమ్ టౌన్లను తీర్చిదిద్దారు. కంపెనీలు, ఉద్యోగుల నుంచి వచ్చే డిమాండ్ ని బట్టి త్వరలో ఈ సెంటర్లను మరిన్ని మారుమూల ప్రాంతాలకు విస్తరించే అవకాశముందని. భవిష్యత్ లో లక్ష మంది ఉద్యోగులు లక్షణంగా పని చేసుకునే వీలుగా 102 సీఎం ఎక్సలెన్స్ సెంటర్లు, 500 కళాశాలలు, 20 ఇంజినీరింగ్ కాలేజీలు సహా ఏపీఐఎస్, ఏపీఐఐసీ కేంద్రాలను వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ కేంద్రాలుగా మార్చబోతున్నట్టు తెలిపారు మంత్రి మేకపాటి. 


రుసుములు ఎలా ఉంటాయి..?
ప్రస్తుతానికి విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్దనగరాలలో ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.5 వేలు మాత్రమే వసూలు చేస్తారు. ఏపీలోని మిగతా పట్టణాల్లో రూ.4వేలు చెల్లిస్తే WFHT సెంటర్లలో పని చేసుకోవచ్చు. ల్యాప్ టాప్ తీసుకుని.. హాయిగా ఆఫీస్ కి వెళ్లొచ్చినట్టు WFHT సెంటర్ కి వెళ్లి రావచ్చు.


Also Read: AP Highcourt : అమరావతి ప్రజలందరి రాజధాని.. విచారణలో హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు !


Also Read: AP Mlc Elections: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల... నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ


Also Read: వచ్చే ఏడాది నుంచి వరంగల్‌కు విమానాలు... ఏఏఐను తుది నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి