ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పడి తీరుతాయని మంత్రి కన్నబాబు చెప్పారు. మూడు రాజధానులకు ప్రజామోదం ఉంది కాబట్టే.. స్థానిక ఎన్నికల్లో 85 శాతం ప్రజల మద్దతు వచ్చిందని చెప్పారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి వైసీబీ ప్రభుత్వం కట్టుబడి ఉందని గానక.. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మూడు రాజధానులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై కామెంట్స్ చేశారు. మూడు రాజధానులు కడతామో... లేదో .. త్వరలో చూస్తారని చెప్పారు.
టీడీపీపై మంత్రి కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదనే.. టీడీపీ అనుకుంటోందని ఆరోపించారు. ఒకే ప్రాంతానికే పరిమితమై ఉండాలనుకుంటే.. బీజేపీ నేతలు అమరావతికి మద్దతుగా వెళ్లొచ్చని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు అనేది అసాధ్యమని.. చంద్రబాబు కలలు కుంటున్నారని ఎద్దేవా చేశారు. కుప్పంలో ఓడిపోతున్నామనే దొంగఓట్లు వేశారంటూ చంద్రబాబు దుష్ర్పచారాలు చేశారన్నారు. కుప్పం మున్సిపాల్టీని వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయమని కన్నబాబు అన్నారు.
రాష్ట్రంలో అన్నదాతలకు వైసీపీ ప్రభుత్వం ఏం సాయం చేయలేదో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పాలని.. కన్నబాబు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తే.. మంచిది కాదని హితవు పలికారు.
గులాబ్ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం కింద 22 కోట్లు అందించామని మంత్రి తెలిపారు. పంట నష్టం కింద 13.96 లక్షల మందికి 1071 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టంపై అంచనాలు వేస్తున్నామని మంత్రి వెల్లడించారు. కేంద్రం మేలు చేస్తుంటే పక్క రాష్ట్రాల్లో రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని కన్నబాబు ప్రశ్నించారు.
Also Read: AP Highcourt : అమరావతి ప్రజలందరి రాజధాని.. విచారణలో హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు !
Also Read: AP Mlc Elections: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల... నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ
Also Read: వచ్చే ఏడాది నుంచి వరంగల్‌కు విమానాలు... ఏఏఐను తుది నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం