పిల్లలకు ఎంతో ఇష్టమైనవి మిల్క్ షేక్‌లు. అరటిపండు, పాలు, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ కొట్టి మిల్క్ షేక్ చేసి తెగ తాగుతుంటారు చాలా మంది. ముఖ్యంగా బరువు పెరగాలని కోరుకునేవారు కూడా పాలు, అరటి పండ్లు ఒకేసారి తినడం, తాగడం చేస్తుంటారు. కానీ ఆయుర్వేద వైద్యులు మాత్రం ఈ రెండూ కలిపి తినకూడదని సూచిస్తున్నారు. ఈ రెండింటినీ తినాలనిపిస్తే కనీసం 20 నిమిషాల గ్యాప్ తో తినమని సిఫారసు చేస్తున్నారు. 


తింటే ఏమవుతుంది?
ఆయుర్వేదం ప్రకారం పాలు, అరటి పండు కాంబినేషన్ ఆరోగ్య పరంగా మంచిది కాదు. కలిపి తినడం వల్ల సైనస్, దగ్గు, జలుబు, అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు శరీరంలో స్వల్పంగా హానిచేసే విషపదార్థాలు కూడా తయారవ్వచ్చు. నిద్రలేమి సమస్య కూడా మొదలు కావచ్చు. ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు ఈ కాంబినేషన్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. లేకుంటే సమస్య మరింత పెరగచ్చు. 
శ్వాసకోశ సమస్యలు రావచ్చు. ఈ రెండింటి కాంబినేషన్లలో తరచూ తింటే వారికి వాంతులు, విరేచనాలు కలగవచ్చు. కొన్ని సార్లు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెబుతోంది ఆయుర్వేదం. 


శాస్త్రీయంగా నిరూపణ అయ్యిందా?
అల్లోపతి వైద్యంలో కూడా కొంతవరకు ఇది నిజమే అని నిరూపణ అయ్యింది. కొన్ని అధ్యయనాల్లో పాలు-అరటిపండు ఒకే సమయంలో తినడం వల్ల సైనస్, జలుబు సమస్యలు ఎటాక్ చేస్తాయని తేలింది. గర్భిణీ స్త్రీలు పాలు తాగిన అరగంట వరకు అరటిపండు జోలికే పోవద్దని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. పాలు, అరటిపండు... రెండింటికీ చలువ చేసే లక్షణాలు ఉన్నాయి. కాబట్టే సమస్యలు రావచ్చని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read Also: గర్భం రాకపోయినా... గర్భం ధరించినట్టు అనిపించే లక్షణాలు, నమ్మి మోసపోకండి


Read Also: చేపల్లో మాత్రమే కాదు, వీటిలో కూడా ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు... శాకాహారులకు ప్రత్యేకం


Read Also: ఒత్తిడి, ఆందోళన వేధిస్తున్నాయా? ప్రశాంతంగా లేదా? ఈ టీలను ప్రయత్నించండి


Read Also:  వంటల్లో ఈ మూడు మసాలాలు కచ్చితంగా వాడండి, క్యాన్సర్ రిస్క్‌ను సగం తగ్గించుకోండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి