ఓ వైపు పెట్రోల్ ధరలు పెరుగుతుంటే.. మరో వైపు సామాన్యుడి జేబు.. చిల్లు పడుతూనే ఉంది. ఆ చిల్లు ఇంకా పెద్దది చేసేందుకు అన్నట్టు కూరగాయల ధరలు కూడా.. రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. వంటలో ఎక్కువగా ఉపయోగించే.. టమోట ధర ఇప్పడు వందకు చేరింది.
మదనపల్లె టమోటా మార్కెట్ లో ధరలు చుక్కలను అంటుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా మేలిమి రకం 30 కిలోల టమోటా బాక్స్ ధర 3 వేల రూపాయలు పలుకుతోంది. మేలిమి రకం టమోటా కిలో వంద రూపాయలకు చేరడం ఇదే మొదటి సారి అని వ్యాపారులు, రైతులు పేర్కొన్నారు. అధిక వర్షాల కారణంగా దిగుబడి తగ్గిపోవడంతో అమాంతం ధరలు పెరిగిపోయాయని చెబుతున్నారు.
దేశంలోనే పేరుగాంచిన మదనపల్లె టమోటా మార్కెట్ లో కిలో టమోటా ధర విపరీతంగా పెరిగింది. గతంలో కిలో టమోటా ధర 98 రూపాయలు పలుకగా.. నేడు అది వందకు చేరినట్లు మార్కెట్ డేటా ప్రకారం తెలుస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో సోమవారం, మంగళవారం టమోటా ధరలు ఆకాశాన్నంటాయి. అధిక వర్షాల కారణంగా దిగుబడి తగ్గిపోయింది. దీంతో మార్కెట్‌లోకి టమోటాలు రావడం లేదు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులలో టమోటా పంట ఎక్కువగా పండిస్తున్నారు. తమిళనాడు,ఆంధ్రప్రదేశ్ లో వర్షాల కారణంగా చాలా వరకు పంట నష్టం వాటిల్లింది. ప్రతిరోజూ మార్కెట్ కు సుమారు 300 మెట్రిక్ టన్నుల టమోటా వచ్చేది. మంగళవారం 148 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చాయని, సోమవారం 255 మెట్రిక్ టన్నులు, ఆదివారం 419 మెట్రిక్ టన్నులు రాగా రోజు రోజుకు దిగుబడి తగ్గిపోతోందని అంటున్నారు. దీంతో ధరల పెరుగుదల వుందని, ఈ ధరల ప్రభావం మరో 15 రోజుల వరకు వుంటుందని అంచనా వేసినట్లు మదనపల్లె మార్కెట్ కార్యదర్శి షేక్ అక్బర్ బాషా వెల్లడించారు.
Also Read: AP Highcourt : అమరావతి ప్రజలందరి రాజధాని.. విచారణలో హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు !
Also Read: AP Mlc Elections: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల... నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ
Also Read: వచ్చే ఏడాది నుంచి వరంగల్‌కు విమానాలు... ఏఏఐను తుది నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం