తన కుమార్తె వివాహానికి ఉద్యోగుల నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు అంతా విధిగా కట్నకానుకలు పంపించాలని ఓ ప్రజాప్రతినిధి హుకూం జారీ చేశారని ఆదే పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆరోపించడం కలకలం రేపుతోంది. ఆ వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ కావడం కోనసీమలో ఈ విషయం చర్చనీయాంశమవుతోంది. ఇటీవలే ఓ ప్రజాప్రతినిధి కుమార్తె వివాహం అయ్యింది. ఆ వేడుకకు అంతా రావాలని, అదే విధంగా వాలంటీరు నుంచి వీఆర్వో వరకు నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఇంత సమర్పించాలని నిర్దేశించి లిస్ట్‌ తయారు చేసి కొంత మంది ద్వారా పంపించారని ఆ వీడియోలో ఆరోపించారు. 


Also Read: వచ్చే ఏడాది నుంచి వరంగల్‌కు విమానాలు... ఏఏఐను తుది నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం


సొంత పార్టీ నేత తీవ్ర ఆరోపణలు


ఇక రిసెప్షన్‌లో ఒక మండలానికి ఒక టేబుల్‌ చొప్పున కౌంటర్లు పెట్టి ఏ మండలానికి ఎవరెవరు కట్నం రాశారని ఓ నాయకుడు పర్యవేక్షించాడని సదరు నేత వీడియోలో ఆరోపించారు. కార్యకర్తలు కష్టపడి ఎంతో వ్యయప్రయాసలతో నాయకున్ని గెలిపించుకుంటారని, తీరా గెలిపించుకున్న తరువాత ఆ కార్యకర్తకు గానీ, ప్రజలకు న్యాయం చేయకపోగా ఈ తరహా పద్ధతులు తమ నియోజకవర్గంలో జరుగుతున్నాయన్నారు. అంతే కాకుండా చేసుకున్నవాడికి చేసుకున్నంత చందంగా ఆ నాయకునికి సపోర్ట్‌గా ఉంటున్నవారు ఇసుక, మట్టి ఇలా అనేక విధాలుగా దోచుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు.  వీరికి పార్టీ కానీ, పార్టీ అధినేత కానీ ఏమైపోయినా పర్వాలేదని విమర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియా వేదికగా హల్‌చల్‌ చేస్తోంది. సొంత పార్టీకు చెందిన ఓ నాయకుడే ఇలా తీవ్ర ఆరోపణలు చేయడం, పైగా వీడియో విడుదల చేయడంపై కోనసీమ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో వైఎస్సార్‌ ఆసరా పథక చెక్కుల పంపిణీ సభల్లో వాలంటీర్లు, విద్యార్థులతో ఆ నేత పాదాలకు పూలు వేయించుకుని పాదపూజ చేయించుకున్నారని వీడియోలు  సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 


Also Read: AP Mlc Elections: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల... నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ


Also Read: భక్తులకు టీటీడీ అలర్ట్.. రెండు రోజులపాటు నడక దారి మూసివేత


Also Read: Minister Kannababu: మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పడి తీరుతాయి.. త్వరలో చూస్తారు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి