వరి కొనుగోలు విషయంలో కేంద్రంపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ పోరుబాట పట్టింది. ఇప్పటికే నియోజకవర్గాల్లో ధర్నాలు చేసిన టీఆర్ఎస్ నేతలు...  ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేయాలని నిర్ణయించారు. దీనికి గురువారం ముహుర్తంగా ఖరారు చేశారు. టీఆర్ఎస్ మ‌హాధ‌ర్నా ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ి. తర్వాత రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి త‌మ డిమాండ్లపై గవర్నర్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పిస్తారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్‌ఎల్పీ భేటీ అనంతరం కేసీఆర్ కీలకమైన ప్రకటనలు చేశారు. 


Also Read : వెంకట్రామిరెడ్డి 5 వేల ఎకరాలు ఎవరికీ బదిలీ చేశారో తెలియదు.. ఆయన రాజీనామా ఆమోదించొద్దు


వరి కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. వరి కొనుగోలు బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. పంజాబ్‌లో మొత్తం ధాన్యం కొంటున్నారు...కానీ తెలంగాణలో కొనడం లేదన్నారు. యాసంగి ధాన్యం కొంటామని ఎఫ్‌సీఐ రాతపూర్వకంగా తెలిపితే కేంద్రం నిరాకరిస్తోందని... అందుకే వరి పంట వద్దని పంట మార్చాలని రైతులకు పిలుపునిచ్చామన్నారు.  యాసంగిలో పండించిన పంటను ప్రైవేటు ఫంక్షన్ల్ హాళ్లు ఇతర చోట్ల నిల్వ చేశామని గుర్తు చేశారు.  యాసంగికి ఎఫ్‌సీఐ తీసుకునే ధాన్యం టార్గెట్ వివ‌రాలను రెండు, మూడు రోజుల్లో ఇవ్వాల‌ని కేంద్రానికి లేఖ రాస్తానని కేసీఆర్ ప్రకటించారు. 


Also Read: TRS MLC Candidates : రాజ్యసభ సభ్యుడ్ని ఎమ్మెల్సీ చేసిన కేసీఆర్ ! ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ మార్క్...


తక్షణం ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతాంగం త‌ర‌పున ధర్నా చేస్తున్నామన్నారు. మహాధర్నాలో రాష్ట్ర కేబినెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జ‌డ్పీ చైర్మన్లు పాల్గొంటారు. బీజేపీని వదిలి పెట్టబోమని టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ కలిసి బీజేపీని ప్రశ్నిస్తారని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు రైతుల‌ను క‌న్ఫ్యూజ‌న్ చేయొద్దు.. రైతుల‌ను ఆగం చేయొద్దని హెచ్చరించారు. సమైక్య పాలకుల కారణంగా ఆగమైన రైతులను కాపాడుకుంటున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. 


Also Read: Bandi Vs TRS : బండి సంజ‌య్‌కు బ్రేకులు వేస్తున్నది ఎవ‌రు? రైతులా? టీఆర్ఎస్ కార్యక‌ర్తలా?


వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి తీరుతామని ప్రకటించారు. క‌రోనా టైంలో కూడా ధాన్యం కొనుగోలు చేసి.. త‌క్షణ‌మే డ‌బ్బులు కూడా పంపిణీ చేశామని గుర్తు చేశారు. యాసంగి పంట‌ల‌కు రైతు బంధు డ‌బ్బులు త్వర‌లోనే ఇస్తామన్నారు. అయితే యాసంగిలో వ‌రి పంట‌ను వేయొద్దని రైతుల‌కు కేసీఆర్ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ నెల పద్దెనిమిదో తేదీ తర్వాత కూడా తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. బీజేపీని పార్లమెంట్‌లోనైనా అన్ని చోట్లా వెంటాడతామన్నారు. 


Also Read: Bjp Vs Trs: రణరంగమైన బండి సంజయ్ పర్యటన.... అడుగడుగునా అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి