వెంకట్రామిరెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్‌కు వెంకట్రామిరెడ్డి బంట్రోతుగా పని చేశారని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డును అష్టవంకరలు తిప్పడం వెనక వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి మెదక్ కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి భూఅక్రమాలకు సహకరించారని ఆరోపించారు. కోకాపేట భూముల వేలంలోనూ వెంకట్రామిరెడ్డి కుటుంబానికి చెందిన రాజ్ పుష్ప సంస్థ భూములను దక్కించుకుందని రేవంత్ రెడ్డి వివరించారు. దుబ్బాక ఉపఎన్నిక సమయంలోనూ ఆయన టీఆర్ఎస్ కు సహకరించినట్టు ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్రంలోని ముఖ్యమంత్రులకు అత్యంత దగ్గరివాడు వెంకట్రామిరెడ్డి అని.. అందుకే.. ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ గా నియమించినట్టు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రికి వేల కోట్లు రూపాయలు సంపాదించి పెట్టడం వంటి నైపుణ్యాలు వెంకట్రామిరెడ్డిలో ఉన్నాయని విమర్శించారు. దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బాధ్యతలను కేసీఆర్ వెంకట్రామిరెడ్డికి అప్పగించారన్నారు. దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సీఈఓగా ఉన్న వెంకట్రామిరెడ్డి 5వేల ఎకరాలు ఎవరికి బదిలీ చేశారో సమాచారం అందుబాటులో లేదన్నారు. భూసేకరణ విషయంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులను కొట్టించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించారని వెంకట్రామిరెడ్డికి శిక్షతో పాటు జరిమానా విధించారని తెలిపారు.
వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖలు రాస్తే తుంగలో తొక్కారు. వెంకట్రామిరెడ్డిని ఆఘమేఘాల మీద ఎమ్మెల్సీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఏడేళ్లు వ్యాపారాలు చేసి వెనక్కి వచ్చిన సోమేశ్ కుమార్‌కు సీఎస్ పదవి ఇచ్చారు. అక్రమార్కులను అడ్డం పెట్టుకొని కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి అధికారులకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నారు. తన ఆస్తుల వివరాలను వెంకట్రామిరెడ్డి ఎక్కడా తెలుపలేదు. వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించేందుకు వీల్లేదు. ఆయన ఎమ్మెల్సీ నామినేషన్ తిరస్కరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
-రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిగా వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం నేరుగా బీఆర్కే భవన్‌కు వెళ్లి సీఎస్ సోమేశ్‌కుమార్‌కు తన రాజీనామా సమర్పించారు. తన రాజీనామాకు ఆమోదం తెలిపిన తర్వాతే సీఎస్ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.
ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, రవీందర్‌రావు, బండా ప్రకాష్‌లు నామినేషన్ వేశారు. అయితే ఆఖరి నిమిషంలో బండా ప్రకాష్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బండా ప్రకాష్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
Also Read: Bandi Vs TRS : బండి సంజయ్‌కు బ్రేకులు వేస్తున్నది ఎవరు? రైతులా? టీఆర్ఎస్ కార్యకర్తలా?
Also Read: Bjp Vs Trs: రణరంగమైన బండి సంజయ్ పర్యటన.... అడుగడుగునా అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు...