అక్కినేని నాగార్జున, ఆయన కుమారుడు నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకు ప్రీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన కల్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాను కూడా డైరక్ట్ చేస్తున్నారు. ఇందులో నాగార్జునకి జంటగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. ఈ మధ్యే ప్రారంభమైన 'బంగార్రాజు' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Also Read: జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ.. ఆలస్యానికి కారణమతడే..
దాదాపు ముగింపు దశకు చేరుకుందని సమాచారం. దాదాపు నాలుగేళ్లపాటు ఈ సినిమా స్క్రిప్ట్ పై పని చేయడంతో పక్కా ప్లాన్ ప్రకారం షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి కానుకగా విడుదల చేయాలనేది ప్లాన్. మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ.. చిత్రబృందం మాత్రం ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేసేసింది. ఇప్పటికే సినిమా నుంచి 'లడ్డుండా' అనే పాటను విడుదల చేశారు.
ఇప్పుడేమో సినిమాలో కృతిశెట్టి క్యారెక్టర్ ను రివీల్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నాగచైతన్య ఓ పోస్ట్ పెట్టాడు. సినిమాలో కృతి.. నాగలక్ష్మి అనే పాత్రలో కనిపించనుంది. ఆమె ఫస్ట్ ను నవంబర్ 18న ఉదయం 10:18 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు చెప్పారు.