దివంగత అందాల నటి శ్రీదేవి సౌత్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా ఏలింది. ఇండస్ట్రీకి ఎంతమంది హీరోయిన్లు వస్తున్నా.. శ్రీదేవిని మాత్రం ఎవరు బీట్ చేయలేరు. ఆమె అందాన్ని, అభినయాన్ని వేరొకరితో పోల్చలేం. ఆమె కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నప్పుడు అందరి దృష్టి ఆమెపైనే ఉండేది. హిందీలో ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ సౌత్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా ఓ సినిమా అనుకున్నారు కానీ కుదరలేదు. 

 


 

అలానే ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాలో జాన్వీని హీరోయిన్ గా తీసుకుందామనుకున్నారు. అది కూడా వర్కవుట్ అవ్వలేదు. చాలా మంది దర్శకనిర్మాతలు జాన్వీ కపూర్ ని టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు కానీ అది జరగడం లేదు. దీనికి కారణం ఎవరో తెలుసా..? ఆమె తండ్రి  బోనీకపూర్ . నిర్మాతగా బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న బోనీకపూర్ ఈ మధ్య సౌత్ లో కూడా సినిమాలు తీయడం మొదలుపెట్టారు. తమిళ, తెలుగు భాషల్లో సినిమాలను నిర్మిస్తున్నారు. 

 

ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'ని దిల్ రాజుతో కలిసి నిర్మించారు బోనీకపూర్. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తెలుగులో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి నిర్మాతలతో కలిసి సినిమాలు చేయబోతున్నారు. సౌత్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న బోనీకపూర్ తన కూతుర్ని మాత్రం టాలీవుడ్ కి పంపించాలనుకోవడం లేదట. 

 

తన తల్లి శ్రీదేవి మాదిరి జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ లో స్టార్ గా ఎదగాలని బోనీకపూర్ ఆశిస్తున్నారు. ఇప్పుడిప్పుడే జాన్వీ ఒక్కో సినిమా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇలాంటి సమయంలో రెండు పడవల ప్రయాణం కరెక్ట్ కాదని భావిస్తున్నారు బోనీకపూర్. బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన తరువాతే మిగిలిన ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టాలని బోనీ తన కూతురికి చెప్పినట్లు తెలుస్తోంది. అంటే ఆమె స్టార్ గా ఫేమస్ అయిన తరువాతే టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందన్నమాట. 

 



Also Read: పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లడం లేదు... సంక్రాంతి బరిలోనే 'భీమ్లా నాయక్'


Also Read: కోటి రూపాయలు గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలంగాణ పోలీస్


Also Read: డిసెంబ‌ర్‌లో కీర్తీ సురేష్ డ‌బుల్ ధ‌మాకా... ఇటు గురి, అటు హిస్టరీ!



Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి  కథియవాడి'


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి