Keerthy Suresh: డిసెంబ‌ర్‌లో కీర్తీ సురేష్ డ‌బుల్ ధ‌మాకా... ఇటు గురి, అటు హిస్టరీ!

కీర్తీ సురేష్ అభిమానులకు గుడ్ న్యూస్. డిసెంబర్‌లో ఆమె నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

Continues below advertisement

డిసెంబ‌ర్‌లో కీర్తీ సురేష్ డ‌బుల్ ధ‌మాకా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆమె నటించిన రెండు సినిమాలు వచ్చే నెలలో విడుదల కానున్నాయి. అందులో ఒకటి తెలుగు సినిమా 'గుడ్ లక్ సఖి'. ఇంకొకటి... మలయాళ సినిమా 'మరక్కార్: లయన్ ఆఫ్ ద అరేబియన్ సీ'. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

'గుడ్ లక్ సఖి' సినిమాను డిసెంబర్ 10న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తొలుత ఈ సినిమాను నవంబర్ 26న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేశామని నిర్మాత సుధీర్ చంద్ర వెల్లడించారు. ఈ సినిమాలో మారుమూల గ్రామానికి చెందిన యువతిగా కీర్తీ సురేష్ కనిపించనున్నారు. ఆమె దేశం గర్వించదగ్గ షూటర్‌గా ఎలా ఎదిగిందనేది కథ.

'మరక్కార్'కు వస్తే... మోహన్ లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. విడుదలకు ముందే ఈ సినిమా జాతీయ పురస్కారం అందుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు అందుకుంది. ఈ సినిమాలో కీర్తీ సురేష్ కీలక పాత్ర చేశారు. డిసెంబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఓటీటీలో 'మరక్కార్' విడుదలవుతుందని వినిపించినా... థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లడం లేదు... సంక్రాంతి బరిలోనే 'భీమ్లా నాయక్'
Also Read: లాయర్లతో రవితేజ మంతనాలు... సెక్షన్ల గురించి ఆరా తీస్తున్న మాస్ మహారాజ్
Also Read: అనుష్క స్లిమ్ గా ఎలా మారిందో తెలుసా..? ఇదిగో ఆమె డైట్ సీక్రెట్..
Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి  కథియవాడి'
Also Read: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement