మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'రావణాసుర'. ఇటీవల సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రావణాసుర టైటిల్‌కు తగ్గట్టు పది తలలతో రవితేజ లుక్ డిజైన్ చేశారు. అలాగే, ఆయన ముందు కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అవి లా బుక్స్ అని ఎవరైనా ఈజీగా చెప్పేస్తారు. రవితేజ లాయర్ కోటు వేసుకోవడంతో పాటు ఆయన చేతిలో న్యాయమూర్తి ఆర్డర్ ఆర్డర్ అని చెప్పేటప్పుడు ఉపయోగించే సుత్తి ఉంది. 'రావణాసుర' సినిమాలో రవితేజ లాయర్ రోల్ చేస్తున్నారు. ప్రేక్షకులకు ఆ విషయం ఫస్ట్ లుక్ చూడగానే అర్థం కావడం కోసమే లుక్ అలా డిజైన్ చేశారన్నమాట.
'రావణాసుర'లో రోల్ కోసం రవితేజ లాయర్లతో మాట్లాడుతున్నారని తెలిసింది. మాస్ మహారాజ్ కెరీర్‌లో లాయర్ రోల్ చేయడమే ఇదే తొలిసారి. కోర్టులో లాయర్లు ఎలా ఉంటారు? అనేది తెలుసుకోవడంతో పాటు కథకు అవసరమైన కొన్ని సెక్షన్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారట. న్యాయవాది పాత్ర అయినా... సినిమా అంతా కోర్ట్ రూమ్ డ్రామా తరహాలో ఉండదు. యాక్షన్ థ్రిల్లర్ కింద తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజకు సొంత బ్యానర్ ఆర్‌టీ టీం వర్క్స్ పతాకాలపై అభిషేక్ నామా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రవితేజ 70వ సినిమా ఇది. దీనికి శ్రీకాంత్ విస్సా కథ అందించారు.
'రావణాసుర' కాకుండా రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ', త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా' సినిమాలు రవితేజ చేస్తున్నారు. ఆ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
Also Read: అనుష్క స్లిమ్ గా ఎలా మారిందో తెలుసా..? ఇదిగో ఆమె డైట్ సీక్రెట్..
Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి కథియవాడి'
Also Read: సన్నీ & కో ని టార్గెట్ చేశారా... బిగ్ బాస్ హౌస్ లో పదకొండోవారం నామినేషన్ల హీట్
Also Read: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి