వీకెండ్ నాగార్జున వచ్చి వెళ్లిన ఆనందం కనీసం 24 గంటల పాటు అయినా మిగలనీయకుండా మర్నాడే నామినేషన్ల హడావుడి మొదలైపోతుంది. వారమంతా ఆహా ఓహో అని మాట్లాడుకునే ఇంటి సభ్యులు నామినేషన్ అనే మాట వినగానే పూనకాలు వచ్చినట్టే ప్రవర్తిస్తుంటారు. ఇక ఈ వారం నామినేషన్ల ప్రక్రియ కూడా  రచ్చ జరిగినట్టే తెలుస్తోంది. " మనసులో ఉండే నిజాలు బయటపెట్టండి..నిజాలు నిలదీస్తూ నామినేట్ చేయండి' అని బిగ్ బాస్ ఆదేశించారు. ఈ మేరకు విడుదలైన ప్రోమోలో ఇంటి సభ్యులంతా సన్నీ, కాజల్ ని నామినేట్ చేసినట్టు అర్థమవుతోంది. 






నీ తప్పు నీకు చెబితే ఎందుకు ఫేక్ అన్నావో అర్థం కాలేదంటూ సన్నీని టార్గెట్ చేశాడు రవి. ఇప్పటికి కూడా ఫేక్ అనుకుంటావా అంటే ఎస్ తన అభిప్రాయం మారదన్నాడు సన్నీ. కాజల్ ని నామినేట్ చేసిన షణ్ముక్..ఆమె ఇంటి నుంచి వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయని చెప్పాడు. రవి ఫస్ట్ నామినేషన్ సన్నీ కాగా రెండో నామినేషన్ కాజల్ అని తెలుస్తోంది. షణ్ముక్ ఊహించుకుని మాట్లాడటం సరికాదంటూ మానస్ రీజన్ చెప్పాడు. మొత్తంగా చూస్తే సన్నీ, కాజల్ ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తుంటే ఈ వారం కూడా కెప్టెన్ రవి మినహా మిగిలిన వారంతా నామినేషన్లో ఉన్నట్టు టాక్. సన్నీ, యానీ మాస్టర్, కాజల్, మానస్, ప్రియాంక, శ్రీరామ్, సిరి, షణ్ముక్ మొత్తం 8 మందిలో ఈ వారం ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతారన్నది వెయిట్ అండ్ సీ.
Also Read: జోరుమీదున్న అక్షయ్ ... ఆకట్టుకుంటోన్న 'పృథ్వీరాజ్' టీజర్
Also Read: హీరోయిన్ షాలు చౌరాసియాపై కేబీఆర్ పార్క్ దగ్గర దాడి... ఖరీదైన మొబైల్ లాకెళ్లిన దుండగుడు
Also Read: కోర్టుకు వెళ్లే ఆలోచ‌న లేదు... ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో మాట్లాడ‌తాం! - 'ఆర్ఆర్ఆర్' నిర్మాత
Also Read: ఓటీటీలో 'శ్రీదేవి సోడా సెంటర్' రికార్డు... సినిమాను కోటి నిముషాలు చూశారు!
Also Read: అటెన్షన్ కోసం నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు.. శిల్పాశెట్టి రియాక్షన్
Also Read:జెస్సీ అవుట్.. సారీ చెప్పిన నాగ్.. 
Also Read: పెద్ద‌మ్మ త‌ల్లి ఆశీస్సులు తీసుకుని... ఫ‌స్ట్ డే షూటింగ్‌కు వెళ్లిన మెగాస్టార్ దర్శకుడ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి