సుధీర్ బాబు, ఆనంది జంటగా 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ తెరకెక్కించిన సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్'. తమ కులం వాడిని కాకుండా వేరే కులం వ్యక్తిని ప్రేమించిన కారణంగా కన్న కుమార్తెను ఓ తండ్రి ఎంత కర్కశంగా చంపాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. పరువు హత్యల నేపథ్యంలో తెలుగులో తక్కువ సినిమాలు వచ్చాయి. వచ్చిన చిత్రాల్లో సహజత్వానికి దగ్గరగా ఉన్న సినిమాగా 'శ్రీ దేవి సోడా సెంటర్'. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను 'జీ 5' తమ ఓటీటీ వేదికలో విడుదల చేసింది.
'జీ 5' ఓటీటీ వేదికలో 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాకు 50 మిలియన్ మినిట్స్ వ్యూస్ వచ్చాయట. అదీ ఏడు రోజుల్లో! అంటే... వారంలో ఈ సినిమాను కోటి నిమిషాలు పాటు జనాలు చూశారన్నమాట. ఈ సందర్భంగా సుధీర్ బాబుతో పాటు సినిమా యూనిట్ సభ్యులు, 'జీ 5'కు మహేష్ బాబు కంగ్రాట్స్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. సుధీర్ బాబు సైతం ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.





థియేటర్లలో ఎన్ని రోజులు ఆడింది? అనేదాన్ని బట్టి గతంలో ఓ సినిమా విజయాన్ని డిసైడ్ చేసేవారు. తర్వాత రోజులు పోయాయి. వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ డే కలెక్షన్స్, ఫస్ట్ వీకెండ్ అండ్ ఫైనల్ రన్ కలెక్షన్స్, ఓవర్ సీస్ మార్కెట్‌లో ఎంత కలెక్ట్ చేసింది? అనేదాన్ని బట్టి విజయాన్ని డిసైడ్ చేసేవారు. ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత? ఎన్ని నిమిషాలు చూశారనేది లెక్కలోకి తీసుకుంటున్నారు. సాధారణంగా ఓటీటీ వేదికలు ఎంతమంది చూశారు? ఎంతసేపు చూశారు? వంటి లెక్కలు చెప్పవు. కానీ, కొన్ని సినిమాలకు చెబుతున్నారు.
Also Read: ఎవరు మీలో కోటీశ్వరులు... కోటి రూపాయలు గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలంగాణ పోలీస్
Also Read: కోర్టుకు వెళ్లే ఆలోచ‌న లేదు... ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో మాట్లాడ‌తాం! - 'ఆర్ఆర్ఆర్' నిర్మాత
Aslo Read: లవర్స్ డే తర్వాత నాలుగు రోజులకు... నిఖిల్, అనుపమ ప్రేమకథలో 18 పేజీలు
Also Read: అటెన్షన్ కోసం నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు.. శిల్పా శెట్టి రియాక్షన్
Also Read: 'పుష్ప'లో సమంత ఐటెం సాంగ్.. బన్నీతో మాస్ డాన్స్ కి రెడీ..
Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం.. ఆ చిన్నారిని బాలయ్య ముందుకు తీసుకొచ్చిన నాని
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి