యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'. జెమినీ టీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి హీరోలు, దర్శకులు, సంగీత దర్శకులు, చాలా మంది సినిమా సెలబ్రిటీలు వచ్చారు. అయితే... వారెవరూ కోటి రూపాయలు గెలుచుకోలేదు. ఈ కార్యక్రమంలో కోటి గెలుచుకున్న తొలి వ్యక్తిగా తెలంగాణకు చెందిన బి రాజా రవీంద్ర చరిత్ర సృష్టించారు. వృత్తిరీత్యా ఆయన పోలీస్. తెలంగాణ పోలీస్ విభాగంలో ఇన్‌స్పెక్ట‌ర్‌గా పని చేస్తున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే...
తెలుగులో 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమం ఇప్పుడు జెమినీ టీవీలో ప్రసారం అవుతోంది. ఇంతకు ముందు 'స్టార్ మా' టీవీలో 'మీలో ఎవరు కోటీశ్వరులు' పేరుతో టెలికాస్ట్ అయ్యింది. అప్పుడు కూడా ఎవరు కోటి రూపాయలు గెలుచుకోలేదు. తెలుగు ఛానల్స్ లో కోటి గెలుచుకున్న తొలి వ్యక్తిగా బి. రాజా రవీంద్ర నిలిచారు. ఆయన స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం. గతంలో గన్ షూటింగ్ లో జాతీయ, అంతర్జాతీయ పోలీస్ క్రీడా పోటీలలో పాల్గొన్నా అనుభవం, పలు పథకాలు సొంతం చేసుకున్న ఘనత రాజా రవీంద్ర సొంతం. ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో పాల్గొని ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో మెడల్ సాధించాలనేది తన లక్ష్యమని, అందుకోసం ఈ కోటి రూపాయలను ఉపయోగిస్తానని ఆయన తెలిపారు.
రాజా రవీంద్రకు ఎన్టీఆర్ వేసిన ప్రశ్నలు ఏమిటి? ఆయన సమాధానాలు ఎలా చెప్పారు? కోటి రూపాయల ప్రశ్న దాకా ఆట ఎంత ఉత్కంఠభరితంగా సాగింది? వంటి విషయాలు తెలుసుకోవాలంటే... జెమినీ టీవీలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' సోమ, మంగళవారం రాత్రి 8.30 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్స్ చూడాలి. గతంలో ఎన్టీఆర్ 'బిగ్ బాస్'కు హోస్ట్ చేశారు. ఓసారి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి అతిథిగా వెళ్లారు. ఇప్పుడు ఆయన హోస్ట్ చేసిన సమయంలో ఓ వ్యక్తి కోటి గెలుచుకోవడం విశేషమే. ఆయన చేతుల మీదుగా కోటి రూపాయల చెక్ ను బి. రాజా రవీంద్రకు అందజేశారు. 
Also Read: కోర్టుకు వెళ్లే ఆలోచ‌న లేదు... ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో మాట్లాడ‌తాం! - 'ఆర్ఆర్ఆర్' నిర్మాత
Aslo Read: లవర్స్ డే తర్వాత నాలుగు రోజులకు... నిఖిల్, అనుపమ ప్రేమకథలో 18 పేజీలు
Also Read: అటెన్షన్ కోసం నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు.. శిల్పా శెట్టి రియాక్షన్
Also Read: 'పుష్ప'లో సమంత ఐటెం సాంగ్.. బన్నీతో మాస్ డాన్స్ కి రెడీ..
Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం.. ఆ చిన్నారిని బాలయ్య ముందుకు తీసుకొచ్చిన నాని
Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి