బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై చీటింగ్ కేసు నమోదైంది. ముంబయికి చెందిన నితిన్ బరాయ్ అనే వ్యాపారవేత్త వీరిద్దరితో పాటు మరికొంతమందిపై ఈ కేసు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా ప్రారంభించిన ఫిట్నెస్ సెంటర్స్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడుదారుల నుంచి ఈ జంట డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా తన దగ్గర నుంచి 1.51 కోట్ల రూపాయలు తీసుకున్నారని.. తిరిగి ఇవ్వమని అడిగితే తనను బెదరిస్తున్నారని ఆ వ్యాపారవేత్త ఫిర్యాదులో పేర్కొన్నారు.


Also Read: మరో వివాదంలో శిల్పాశెట్టి దంపతులు.. చీటింగ్ కేసు నమోదు


దీనిపై శిల్పాశెట్టి రియాక్ట్ అయింది. రాజ్ కుంద్రాపై, తనపై కేసు నమోదు చేయడంతో షాకయ్యానని చెప్పింది. 28 ఏళ్లుగా ఎంతో కష్టపడి పని చేస్తున్నానని.. అలాంటిది తన పేరు, ప్రఖ్యాతలకు ఇలా భంగం కలగడం బాధగా ఉందని చెప్పుకొచ్చింది. SF ఫిట్నెస్ వెంచర్ అనేది కాషిఫ్ ఖాన్ అనే వ్యక్తి చేతుల్లో ఉందని క్లారిటీ ఇచ్చింది శిల్పాశెట్టి. ఈ బ్రాండ్ కి సంబంధించిన నేమింగ్ రైట్స్ అన్నీ కూడా ఆయన తీసుకున్నారని.. దేశవ్యాప్తంగా బ్రాంచ్ లు కూడా ఓపెన్ చేశారని తెలిపింది. 


ఫిట్నెస్ సెంటర్ కి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా కాషిఫ్ ఖానే చూసుకుంటున్నారని చెప్పింది. ఆయనకు సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని.. కాషిఫ్ ఖాన్ నుంచి ఒక్క రూపాయి కూడా తాము తీసుకోలేదని చెప్పుకొచ్చింది. మొత్తం అన్ని ఫ్రాంచైజీలను కాషిఫ్ ఒక్కడే హ్యాండిల్ చేస్తున్నారని స్పష్టం చేసింది. 2014లోనే ఫిట్నెస్ సెంటర్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలను కాషిఫ్ ఖాన్ ని హ్యాండోవర్ చేశామని తెలిపింది. దాదాపు 28 ఏళ్లుగా కష్టపడి పని చేస్తున్నానని.. అలాంటిది తన పేరు, ప్రఖ్యాతలను కేవలం ఎటెన్షన్ కోసం ఇలా డ్యామేజ్ చేస్తుండడం తట్టుకోలేకపోతున్నానని రాసుకొచ్చింది. 











ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి