రాష్ట్రంలో మిగిలిన పంచాయతీలకు ఆదివారం పోలింగ్ జరింగింది. వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన 36 సర్పంచి, 68 వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి గెలుపొందిన వారి పేర్లు ప్రకటిస్తారు. పోలింగ్, లెక్కింపు సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మరో 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు.


Also Read: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో సోనూసూద్ సోదరి


350 పోలింగ్ కేంద్రాలు


ఎన్నికల జరగాల్సిన మొత్తం 69 పంచాయతీలలో 30 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 533 వార్డులలో 380 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వివిధ జిల్లాలోని 36 సర్పంచ్‌ స్థానాలకు, వివిధ గ్రామాల్లోని 68 వార్డుల్లోనూ ఇవాళ ఎన్నికలు జరిగాయి. మొత్తం 350 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరిగింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. 


Also Read: ABP-CVoter Survey: యూపీ భాజపాకే.. కానీ 100 సీట్లు హాంఫట్.. పంజాబ్‌లో ఒకటి కూడా కష్టమే!


వచ్చే మూడు రోజుల పోలింగ్ 


నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. డప్పుల చప్పుళ్లు, నినాదాల హోరు మూగబోయాయి. ప్రచారాలు ముగియడంతో మైకులు బంద్‌ అయ్యాయి. ఆదివారం నుంచి వరుసగా మూడ్రోజులు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 17.69 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివారం వివిధ జిల్లాల్లోని 36 సర్పంచ్‌ స్థానాలతో పాటు వివిధ గ్రామాల్లోని 68 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరగగా... సోమవారం నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.


Also Read: గుడికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడికి వచ్చినా అంతే పుణ్యం: వెంకయ్య నాయుడు


Also Read: విశాఖలో భూ ప్రకంపనలు.. ఆదివారం భయంతో మేల్కొన్న నగర వాసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి