పిల్లల దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నారులకు తెలంగాణ ఆర్టీసీ ఓ బహుమతి ఇచ్చింది. బాలల దినోత్సవం సందర్భంగా ఈ రోజు (నవంబరు 14)న 15 ఏళ్లలోపు పిల్లలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. ఈ కానుకకు సంబంధించి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. బాలల దినోత్సవం అయిన నేడు ఆర్టీసీకి చెందిన ఏసీ బస్సులు, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్ అన్ని బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఈ రోజు ఒక్కరోజు ఏ బస్సులోనూ చిన్నారులకు టికెట్ అవసరం ఉండదని ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. దీనికి సంబంధించి సజ్జనార్ ట్వీట్ చేశారు.










Also Read: Vizag Crime: హోటల్ రూంలో TS యువకుడు, ఆంధ్రా యువతి.. కాసేపటికి మంటల్లో ఇద్దరూ.. షాకైన సిబ్బంది


దీంతో పలువురు చిన్నారులు శ్రీశైలం వెళ్తున్న ఓ వీడియోను ట్వీట్ చేశారు. వారు బస్సు ఎక్కినా టికెట్ తీసుకోలేదని తెలిపారు. ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించగా.. నేడు బాలల దినోత్సవం అని తమలాంటి పిల్లలకు మినహాయింపు ఇచ్చారని పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు.






Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి