తండ్రులు లేని సమాజాన్ని మీరు ఎప్పుడైనా ఊహించారా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, మీరు టిబెట్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామాల గురించి తెలుసుకోవల్సిందే. వాస్తవానికి ‘వన్ నైట్ స్టాండ్’ అనేది ఇప్పుడిప్పుడే మన దేశంలో చాపకింద నీరులా పాకుతోంది. అయితే, ఈ ప్రాచీన గ్రామాల్లో ‘వన్ నైట్ స్టాండ్’ను ఒక సాంప్రదాయంగా పాటిస్తున్నారు. ఇక్కడి స్త్రీ, పురుషులు లైంగికంగా కలుస్తారు.. పిల్లలను కంటారు. కానీ, తండ్రులు ఆ పిల్లలను పోషించరు. పిల్లలు బాగోగులను తల్లి లేదా తల్లి సోదరుడు (మేనమామ) మాత్రమే చూసుకుంటారు. ఈ వింత సాంప్రదాయాన్ని అక్కడ ‘జౌ హున్’ (వాకింగ్ మ్యారేజ్) అని అంటారు. అంటే.. పెళ్లి చేసుకుని ఎవరి దారి వారు చూసుకోవడం. ఒకరకంగా చెప్పాలంటే ఇది అస్సలు పెళ్లే కాదు.
పెళ్లి చేసుకోరు, కానీ..: నైరుతి చైనాలోని హిమాలయాల్లో, టిబెట్ సరిహద్దులో గల యున్నాన్, సిచువాన్‌లో ‘మొసువో’ అనే పురాతన గిరిజన సమాజానికి చెందిన ప్రజలు ఈ విధానాన్ని పాటిస్తున్నారు. ‘మొసువో’ సాంప్రదాయంలో స్త్రీలే మహారాణులు. అక్కడ పురుషులు డమ్మీలు మాత్రమే. ఇక్కడ స్త్రీ, పురుషులను సమానంగా భావిస్తారు. కానీ, మహిళల అనుమతి లేకుండా పురుషులు ఏ పనులు చేయలేరు. అంటే ఇక్కడ కేవలం స్త్రీ పెత్తనమే నడుస్తుంది. వాకింగ్ మ్యారేజ్ తర్వాత పురుషుడు.. తనను ఇష్టపడే మహిళతో ఏకాంతంగా గడుపుతాడు. సూర్యోదయానికి ముందే తిరిగి తమ తల్లి లేదా మేనమామ ఇంటికి వెళ్లిపోతాడు. ఇక్కడి పిల్లలను తల్లికి మాత్రమే రక్త సంబంధికులుగా భావిస్తారు. తండ్రి కేవలం వీర్యదాత మాత్రమే. పురుషులు ఏమైనా లైంగిక కోరికలు తీర్చుకోవాలంటే రాత్రి వేళ్లలో మాత్రమే వెళ్లాలి. ఇందుకు ఆ మహిళ అనుమతి తప్పనిసరి. ఆమె నిరాకరిస్తే తిరిగి ఇంటికి వెళ్లిపోవల్సిందే. ఒక వేళ ఆ మహిళ శృంగారానికి అంగీకరిస్తే.. రాత్రి నుంచి సూర్యోదయం వరకు ఆమెతో ఏకాంతంగా గడపొచ్చు.
ఎవరితోనైనా ఏకాంతంగా ఎంజాయ్ చేయొచ్చు: ఇక్కడ మరో ఆచారం కూడా ఉంది. ఇక్కడి మహిళలు కేవలం తనకు ఇష్టమైన పురుషుడితోనే జీవితాంతం గడపాలని లేదు. ‘యాక్సియా’ అనే సాంప్రదాయం కింద ‘వన్ నైట్ స్టాండ్’ను కూడా పాటిస్తారు. అంటే.. తమకు నచ్చిన పురుషుడితో స్త్రీలు రాత్రంతా గడపొచ్చు. ఆ తర్వాత వారితో ఎలాంటి సంబంధం ఉండదు. ఒక వేళ ఆ పురుషుడి వల్ల గర్భం దాల్చితే.. దాన్ని ‘వాకింగ్ మ్యారేజ్’గా పరిగణించి ఆ బిడ్డను తల్లి లేదా మేనమామ పెంచుతారు. ‘యాక్సియా’ సమయంలో స్త్రీ తన నివాసం ముందు పురుషుడి టోపీని తగిలిస్తుంది. అంటే.. ఇతర పురుషులు తన ఇంట్లోకి ప్రవేశించకూడదని అర్థం.
ఇది మహిళల రాజ్యం: మన పురుష ప్రపంచానికి భిన్నంగా ‘మొసువో’ ఉంటుంది. ఇక్కడ స్త్రీలు మాత్రమే ఆస్తులను వారసత్వంగా పొందుతారు. మహిళలు మాత్రమే వ్యవసాయం చేస్తారు. ఇంటి బాధ్యతలను నిర్వహిస్తారు. వంట చేయడం, పిల్లలను పెంచడం వారి కర్తవ్యం. పురుషులు కేవలం బలమైన పనులు మాత్రమే చేస్తారు. వ్యవసాయ క్షేత్రాలను దున్నడం, నిర్మాణాలు, జంతువులను వేటాడటం, వధించడం పురుషుల పని. కొంతమంది పురుషులు ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటారు. ఇంటి పెద్దగా అమ్మమ్మలే ఉంటారు. మొసువో సమాజంలోని పిల్లలకు తమ తండ్రెవరో తెలీదు. తల్లి, మేనమామలే వారి లోకం.
ప్రేమిస్తారు.. సాయం చేస్తారు: ఇక్కడి ప్రజల్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనే లక్ష్యం ఉండదు. అయితే, వారికి లైంగిక స్వేచ్ఛ ఉంటుంది. అది విచ్చలవిడిగా కాకుండా ఒక పద్ధతిలో సాగుతుంది. ఇక్కడి జీవితాలు యాంత్రికంగా ఉంటాయని అనుకుంటే పొరపాటే. ఇక్కడ ఎవరైనా ప్రేమలో పడితే.. జీవితాంతం ఒకే ఇంటిలో కలిసి లేకపోయినా.. ఒకరి కోసం ఒకరు సాయం చేసుకుంటూ జీవిస్తారు. పిల్లల పెంపకంలో సమస్యలు వస్తే చేయూతనిస్తారు. ఒకే ఇంట్లో కలిసి ఉండకపోవడం వల్ల పెద్దగా గొడవలు ఉండవు. కానీ, లైంగిక స్వేచ్ఛ వల్ల ప్రేమికుల మద్య స్పర్థలు వస్తుంటాయని స్థానికులు చెబుతారు. పెళ్లిల్లు లేకపోవడం వల్ల అందరికీ పిల్లలు పుడతారని అనుకుంటే పొరపాటే. కొందరు స్త్రీలు పిల్లలను కనేందుకు పెద్దగా ఇష్టపడరు. ఇలాంటివారు వేరే కుటుంబానికి చెందిన పిల్లలను దత్తత తీసుకుని పెంచుతారు.
Also Read: కుయ్యో.. మూత్రం పోస్తుంటే ‘అక్కడ’ కాటేసిన పాము.. ‘అది’ కుళ్లిపోయి నరకయాతన, చివరికి..
పరిస్థితులు మారుతున్నాయి.. కానీ: ప్రస్తుతం మొసువోలో పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు ఇక్కడి ప్రజలు తాము తయారు చేసుకున్న వస్తువులను మాత్రమే ఉపయోగించేవారు. 1990 నుంచి పరిస్థితులు మారాయి. చైనా ఇక్కడి గ్రామాలకు రోడ్లు ఇతరాత్ర మౌళిక వసతులు కల్పించడం మొదలుపెట్టింది. ఇక్కడి ప్రజలకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలకు దారులు తెరిచింది. దీంతో కొందరు చైనాలోని పలు నగరాలకు వెళ్లిపోయారు. అయితే, వాకింగ్ మ్యారేజ్ సాంప్రదాయం మాత్రం ఇక్కడ ఇంకా నడుస్తోంది. ఇప్పటికే ఇక్కడ స్త్రీలదే రాజ్యం. అయితే, మహిళలు తమకు నచ్చిన పురుషులను తమతోనే కలిసి ఒకే ఇంటిలో జీవించేందుకు అనుమతి ఇస్తున్నారు. పిల్లల బాధ్యతలను వారికి అప్పగిస్తున్నారు. బయటి ప్రపంచంలో వైవాహిక జీవితాలు గురించి వారికి ఇప్పుడిప్పుడే అవగాహన కలుగుతోంది. అయితే, మొసువో ప్రజలు వాకింగ్ మ్యారేజ్ సాంప్రదాయమే ఉత్తమం అని భావిస్తున్నారు.
Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి