మన దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. ఒక్కో వర్గానికి ఒక్కో ఆచారం ఉంటుంది. కొన్ని సంప్రదాయాలు చాలా చిత్రంగా అనిపిస్తాయి. వాటి గురించి విన్నప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతారు. అయితే, మన దేశంలో ఇప్పటికే చాలావరకు ఆచారాలు అంతరించిపోయాయి. యువత పాశ్చాత్య మార్గంలోకి అడుగుల వేస్తున్న నేపథ్యంలో మన పూర్వికుల నాటి ఆచారాలన్నీ కనుమరుగయ్యాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం.. ఇంకా తమ సాంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మణికర్న్ వ్యాలీ ప్రజలు కూడా ఈ కోవకే వస్తారు.
భారత దేశంలో నగ్నత్వాన్ని తప్పుగా భావిస్తారనే సంగతి తెలిసిందే. అయితే, పిని గ్రామానికి చెందిన ప్రజలకు మాత్రం అది సంప్రదాయం. వారి ఆచారం ప్రకారం.. అక్కడి మహిళలు ఐదు రోజులు నగ్నంగా ఉండాలి. అయితే, ప్రతి రోజు నగ్నంగా ఉండాల్సిన అవసరం లేదు. ఏడాదిలో ఐదు రోజులు మాత్రమే అలా ఉండాలి. కొత్తగా పెళ్లయిన వధువు సైతం.. ఐదు రోజులు నగ్నంగా ఉండాలి. ఆ 5 రోజులు భర్తకు దూరంగా ఉండాలి. అంతేకాదు.. ఆ 5 రోజులు ఇంట్లో ఎవరూ కనీసం నవ్వకూడదు కూడా. అయితే, నగ్నంగా ఉన్న ఐదు రోజులు మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లరు. అలాగే బయట వ్యక్తులు కూడా వారిని చూడకూడదు. దానివల్ల వారు నగ్నంగా ఉన్నా.. ఎలాంటి భయం లేకుండా గడుపుతారు.
గ్రామంలోని మహిళలు ఈ సంప్రదాయాన్ని పాటించకపోతే వారి ఇంట్లో అశుభం కలుగుతుందని, బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందని భావిస్తారు. ఈ సంప్రదాయం ప్రారంభం కావడం వెనుక ఒక కథ దాగి ఉంది. ఒకప్పుడు ఓ రాక్షసుడు పిని గ్రామాన్ని పీడించేవాడు. దుస్తులు ధరించిన అందమైన వివాహిత మహిళలను ఎత్తుకుపోయేవాడు. దీంతో అక్కడి మహిళలు దుస్తులు విప్పేసి.. తమని రక్షించాలని దేవతలను వేడుకున్నారు. వారి మొర అలగించిన దేవతలు ఆ రాక్షసుడిని సంహరించి.. గ్రామ మహిళలను రక్షించారు. అప్పటి నుంచి అక్కడి మహిళలు ఏడాదిలో ఐదు రోజులు నగ్నంగా ఉంటున్నారు. ఆ ఐదు రోజులు వారు బయట ప్రపంచానికి దూరంగా ఉంటారు. పురుషులే కాదు.. స్త్రీలు కూడా వారిని చూడరు.
శ్రావణ మాసంలో ఎక్కువగా సంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ సందర్భంగా అక్కడి మహిళలు లహువా దేవతకు పూజలు చేస్తారు. లహువా దేవత గ్రామాన్ని చెడు నుంచి రక్షిస్తుందని, తమను కంటికి రెప్పలా కాపాడుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల కొంతమంది మహిళలు పూర్తిగా నగ్నంగా కాకుండా.. పలుచని దుస్తులు ధరించి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఐదు రోజుల పాటు మహిళలు ఎలాంటి వేడుకల్లో పాల్గొనకూడదు. ఆ సమయంలో నగ్నంగా ఉన్న మహిళతోపాటు మరెవ్వరూ నవ్వకూడదు. ఒకవేళ నవ్వితే దేవతల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు.
Also Read: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి