ప్రపంచంలో మీరు ఎన్నో రకాల మొక్కలను చూసి ఉంటారు. అయితే ఈ మొక్కను మాత్రం మీరు చూసి ఉండరు. అంతేకాదు.. దాని పేరు కూడా మీరు విని ఉండరు. ఈ అరుదైన మొక్క పేరు ‘పెనిస్’. అంటే ‘పురుషాంగం’ అని అర్థం. ఈ పేరు వినగానే.. ‘‘ఛీ, పాడు ఇదేం పేరు’’ అని అనుకుంటున్నారు కదూ. అయితే, ఆ మొక్కకు పూసే పువ్వు రూపాన్ని బట్టి.. అంతా ఆ పేరుతో పిలుస్తున్నారు. అయితే, ఈ పువ్వు అన్ని సీజన్ల పూయదు. పాతికేళ్లకు ఒకసారి మాత్రమే పూస్తుంది. అందుకే, దానికంత ప్రత్యేకత. 


ఆరున్నర అడుగుల పొడవుండే ఈ ‘పెనిస్ ప్లాంట్’.. పాతికేళ్ల తర్వాత ఐరోపా గడ్డపై తొలిసారి పుష్పించింది. ఈ మొక్క శాస్త్రీయ నామం ‘అమోర్ఫోఫాలస్ డెకస్-సిల్వే’. లైడెన్ హోర్టస్ బొటానికస్‌లో ఉన్న ఈ మొక్క ఈ నెల 19న పుష్పించింది. ఇండోనేషియాలోని జావా దీవిలో ఈ పెనిస్ మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. అయితే, ఈ పువ్వు పుష్పించడం చాలా కష్టం.


పువ్వే కదా మాంచి సువాసన వస్తుందని.. వాసన చూసేందుకు మాత్రం ప్రయత్నించకండి. ఎందుకంటే.. ఈ పువ్వు నుంచి వచ్చే కంపును భరించడం చాలా కష్టం. యూరప్ దేశాల్లో ఇలాంటి మొక్కలు పెరగడం చాలా అరుదు. ఈ మొక్క చివరిసారిగా 1997లో మాత్రమే పూసింది. దాదాపు పాతికేళ్ల తర్వాత మళ్లీ ఈ ఏడాది వికసించింది. ఈ మొక్క పుష్పించడానికి ముందు ఆకులను తయారు చేసుకుంటుంది. దుంపలలో ఆహారాన్ని నిల్వ చేస్తుంది. పుష్పించిన తర్వాత మళ్లీ ఆకుల పెరుగుదల మళ్లీ మొదలవుతుంది.


గ్రీన్‌హౌస్ మేనేజర్ రోజియర్ వాన్ వుగ్ట్ డచ్ మీడియా ఔట్‌లెట్ ‘ఓమ్రోప్ వెస్ట్‌’తో మాట్లాడుతూ.. ‘అమోర్ఫోఫాలస్’ అంటే ‘ఆకారం లేని పురుషాంగం’ అని అర్థం. అకస్మాత్తుగా చూస్తే ఇది అంగం తరహాలోనే ఉంటుందన్నారు. వాస్తవానికి ఇది పొడవాటి కాండమని తెలిపారు. దీని వాసన కుళ్లిన మాంసం తరహాలో ఉంటుందన్నారు.






Also Read: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?