భూటాన్‌‌ను దేశమని చెప్పడం కంటే భూతల స్వర్గంగా చెప్పుకోవచ్చు. అక్కడ ఒక్కసారి అడుగుపెడితే.. తప్పకుండా మీరు ప్రకృతితో ప్రేమలో పడిపోతారు. అంతేకాదు.. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతాం. సంతోషంగా జీవిస్తున్న అక్కడి ప్రజల జీవన విధానం చూసి.. మనదీ ఒక జీవితమేనా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అయితే, అక్కడి ప్రజల ఇళ్ల ముందు కొన్ని చిత్రాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రతి ఇంటి పైనా పులి, పురుషాంగాల బొమ్మలు ఉంటాయి. మరి, వారి హ్యాపీనెస్‌కు కారణం అదేనా? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? వారు ఆ బొమ్మలను ఇంటిపై ఎందుకు గీస్తారు? 


ఆసియాలోనే హ్యాపీ కంట్రీ: మీకు తెలుసా? ఆసియాలో సంతోషకరమైన దేశం ‘భూటాన్’. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితే వెల్లడించింది. ఇక్కడి ప్రజలు చీకూచింత లేకుండా హాయిగా బతికేస్తున్నారు. అందుకే, చైనా ఆ దేశాన్ని ఎలాగైనా తమ వశం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే, ఆ దేశానికి ఇండియా అంటేనే ఎక్కువ ఇష్టం. పచ్చని పర్వతాల్లో.. మంచు కొండలే సరిహద్దులుగా.. కాలుష్యం లేని కారడవుల్లో నివసిస్తున్న ఈ ప్రజలు ప్రపంచంతో పనిలేకుండా చాలా హాయిగా బతికేస్తున్నారు. పైగా ఇక్కడ పాలన విధానం చాలా భిన్నమైనది. ప్రస్తుతం ఇక్కడ ప్రజాస్వామ్య రాచరిక పాలన అమల్లో ఉంది. పైగా మన దేశంలో ఉన్నట్లు కుళ్లు రాజకీయాలు, కుట్రలు కుతంత్రాలు ఉండవు. అవినీతి కానరాదు. బుద్ధుడిని స్మరిస్తూ ప్రశాంత జీవితాన్ని గడిపేస్తున్నారు.  


ఇళ్ల ముందు పురుషాంగాలు: భూటాన్‌లో అడుగుపెడితే ప్రతి ఇంటి ముందు పురుషాంగాల చిత్రాలు కనిపిస్తాయి. బొమ్మలను కూడా విక్రయిస్తారు. కొందరు పురుషాంగాలను ఆరాధిస్తారు కూడా. అయితే, బ్రహ్మచర్యం స్వీకరించిన యువతలు నివసించే ఆలయాలు, ప్రార్థనా స్థలాల్లో మాత్రం ఈ బొమ్మలు ఉండవు. భూటాన్‌లో అందంగా అలంకరించిన పురుషాంగాల బొమ్మలును గుమ్మాలకు వేలాడదీస్తారు. కొందరు ప్రవేశ ద్వారం గోడలపై పెయింట్ చేస్తారు. కొందరు పులి బొమ్మలు, భయంకరమైన డ్రాగన్ కన్నులు కూడా గోడలపై చిత్రీకరిస్తారు.  


ఇదీ చరిత్ర: పురుషాంగం బొమ్మలకు భూటాన్‌కు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. 15వ శతాబ్దానికి చెందిన ద్రుక్పా కున్లే (లామా కున్లే) అనే మావెరిక్ టిబెటన్ మతపెద్ద తన బోధనలను వ్యాప్తి చేయడం కోసం కొత్త ప్రదేశాన్ని అన్వేషించారు. ఈ సందర్భంగా ఆయన టిబెట్ నుండి ఒక బాణాన్ని ప్రయోగించాడని, అది భుటాన్‌లోని పునాఖా(ప్రస్తుతం చిమి లఖాంగ్‌)లోకి దూసుకెళ్లింది. ఆ బాణం కోసం వెతుకుతున్నప్పుడు, ఆయనకు ఓ యువతి కనిపించింది. దీంతో ఆయన ఆమెను వెంబడించారు. ఆమె విధేయతకు సంతోషించిన ఆయన.. ఆమెతో ఒక రాత్రి గడిపాడు. ఫలితంగా ఆమెకు ఒక బిడ్డ జన్మించింది. ఫలితంగా అక్కడి ప్రజలు ఆయనకు ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించారు. దాన్ని సంతానోత్పత్తి ఆలయం అని కూడా అంటారు. ఇప్పటికీ అక్కడ ఆ మతపెద్ద విల్లు, బాణం, దంతాలు భద్రంగా ఉన్నాయి. అప్పట్లో ఆ మతపెద్ద లైంగిక పిచ్చి ప్రజలను విస్తుగొలిపించింది. అతడి నోటి వెంట ఎప్పుడూ అశ్లీల పదాలే దొర్లేవి. చివరికి అతడు పురుషాంగాలను ఆరాధించేలా ప్రేరేపించాడు. ఆ తర్వాత కున్లే దోచులా పాస్‌ ప్రజలను భయపెడుతున్న లోరో డ్యూమ్ అనే రాక్షసిని వెంబడించాడు. అది అతడి నుంచి తప్పించుకొనేందుకు కుక్కలా మారింది. అయితే, కున్లే.. డ్రాగాన్ పిడుగు(Thunder Dragon) సాయంతో దాన్ని కనిపెట్టి, సంహరించాడు. ఆ తర్వాత దాన్ని కొండపై పాతిపెట్టి.. సమాధిపై నల్ల రంగు బౌద్ధ మందిరాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి అక్కడి ప్రజలు దెయ్యాలు, రాక్షసులు తమ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండేందుకు ఇళ్లల్లో పురుషాంగం బొమ్మలు, ఇంటి బయట వాటి చిత్రాలను పెట్టుకోవడం ఆచారంగా మార్చుకున్నారని స్థానికులు చెబుతుంటారు. అక్కడి ప్రజలు పురుషాంగాలను అశ్లీలం, అసభ్యం లేదా బూతుగా పరిగణించరు. తమను కాపాడే దైవంగానే భావిస్తారు. ఆట బొమ్మల తరహాలోనే అక్కడ పురుషాంగాలను బహిరంగంగా విక్రయిస్తారు.


భూటాన్ ప్రపంచానికే ఆదర్శం.. ఎందుకంటే..:
❂ భూటాన్ అంటే ‘థండర్ డ్రాగాన్ భూమి’ (Land of the Thunder Dragon) అని అర్థం.
❂ భూటాన్ ఆసియాలోనే అత్యంత చిన్న దేశం.
❂ 1974 వరకు భూటాన్‌ ప్రజలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బతికారు.
❂ భూటాన్‌లో ప్రతి ఒక్కరు తమ సాంప్రదాయ దుస్తులైన కిరా జాకెట్లను ధరించాలి.
❂ భూటాన్‌లో రోడ్లపై ఎక్కడా ట్రాఫిక్ సిగ్నళ్లు కనిపించవు. 
❂ భూటాన్ ప్రజలు వాహనాలను చాలా నెమ్మదిగా నడుపుతారు.
❂ భూటాన్‌లో 2001 నుంచి టీవీ, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం గమనార్హం.
❂ భూటాన్ జాతీయ జంతువు ‘టకిన్’. దీని తల మేకలాగ, శరీరం గేదెలా ఉంటుంది.
❂ భూటాన్ రాజధాని థింపూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాజధాని.
❂ భూటాన్‌లో 2005 వరకు రాచరికం ఉండేది.


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


❂ 2005లో కింగ్ జిగ్మే సింగే వాంగ్‌చుక్ ప్రజాస్వామ్యంతో కూడిన రాచరిక ప్రభుత్వం కోసం ఎన్నికలు నిర్వహించారు.
❂ 1999 నుంచి భూటాన్‌లో ప్లాస్టిక్ బ్యాగ్గులను నిషేదించారు. 
❂ భూటాన్‌ ప్రజలకు ప్లాస్టిక్ బ్యాగులు దొరికితే.. వాటిని ఉతికి, ఆరవేసి మళ్లీ వినియోగిస్తారు.
❂ భూటాన్‌లో 80 శాతం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. వారికి అదే ప్రధాన ఆదాయ వనరు. 
❂ పర్యాటకం, వ్యవసాయం, హైడ్రో విద్యుత్తు ప్లాంట్ల ద్వారా భూటన్‌కు తగిన ఆదాయం.
❂ భూటాన్‌లో చలికాలం వ్యవసాయం నిలిచిపోతుంది. ఆ సీజన్‌లో ఆహారం దొరకడం కష్టం.
❂ చలికాలం కోసం వేసవి కాలంలోనే కూరగాయలు, పండ్లు, మాంసాన్ని ఎండబెట్టి నిల్వ చేస్తారు.


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


❂ బౌద్ధ మతస్థులు సాధారణంగా శాఖాహారులు. కానీ భూటాన్ ప్రజలు మాత్రం మాంసం తింటారు. 
❂ భూటాన్‌లో జంతువుల సంహారం నిషేదం. మాంసాహారాన్ని ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటారు.
❂ భూటాన్‌లో పొగాకు ఉత్పతులను నిషేదించారు. దూమపానం నేరం. 
❂ అడవుల పరిరక్షణకు భూటాన్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుంది.
❂ జనాభాలో 60 శాతం మంది అడవుల్లోనే జీవిస్తారు.
❂ భూటాన్‌లో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్క చెట్టునైనా నాటాలి.
❂ భూటాన్ ప్రజలకు విద్య, వైద్యం ఉచితం. అక్కడ కార్పొరేట్ దోపిడీలు ఉండవు. అందుకే అక్కడి ప్రజలు అంత హ్యాపీగా జీవిస్తున్నారు.


 


Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!


Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం


Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!


Also Read: ఛీ.. యాక్.. ఈ ఆహారాన్ని లొట్టలేసుకుని మరీ తింటారట, ఇది ఏమిటో తెలుసా?


Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి