చూడగానే నోరూరించే ఆహారాలు మన ప్రపంచంలో చాలానే ఉన్నాయి. కానీ, కొన్ని ఆహారాలను చూస్తే మాత్రం తప్పకుండా చీదరించుకుంటారు. వీటిని కూడా ఆహారం అంటారా అని ఆశ్చర్యపోతారు. పై చిత్రంలో చూసిన ఆహారం కూడా ఈ రకానికి చెందినదే. దీన్ని చూడగానే నోరూరడం కాదు.. వాంతి కూడా వస్తుంది. దాని పేరు వింటేనే.. కడుపులో తిప్పేస్తుంది. దాని రూపం, పేరును పట్టించుకోకుండా కళ్లు మూసుకుని తింటే.. మాత్రం నోట్లో కరిగిపోతుందట. 


ఇంతకీ ఈ ఆహారం పేరు ఏమిటో తెలుసా? క్యాట్ పూ. అవును.. మీరు చదివింది కరెక్టే. అది దాని పేరు ‘పిల్లి మలం’. చూసేందుకు కూడా అలాగే ఉంటుంది. సింగపూర్‌లోని నాస్టీ కుకీలో బేకర్లు ఆహారాన్ని ఇలా భయానకంగా తయారు చేస్తారు. పిల్లి విసర్జన తరహాలో కనిపించే నల్లని చాక్లెట్ బ్రౌనీలను.. ఇసుక తరహాలో కనిపించే పొడిలో పెట్టి మరీ వడ్డిస్తారు. అంటే.. పిల్లి ఇసుకలో విసర్జించినట్లుగా ఆ ఆహారాన్ని అలంకరిస్తారు. కొ(చె)త్తదనాన్ని ఇష్టపడే వ్యక్తులు ఇలాంటి ఆహారాన్ని లొట్టలేసుకుని మరీ తినేస్తారట. ‘క్యాట్ పూప్’ బ్రౌనీస్‌ను చాలా అరుదుగా తయారు చేస్తారు. హాలోవీన్ సీజన్‌లో భాగంగా అక్టోబరు 16 నుంచి 31వ తేదీ వరకు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. మూడు క్యాట్ పూప్‌లు ఉండే ఒక్క బాక్సు విలువ జస్ట్ 5 డాలర్లు (రూ.376) మాత్రమే. దాని రూపం ఎలా ఉనర్నా.. వాసన మాత్రం చాలా బాగుంటుదట. 


పిల్లి మలాన్ని పోలిన ఇలాంటి ఆహారాన్ని ఎవరు తింటారని మాత్రం ముఖం చిట్లించుకోవద్దు. ఈ ఆహారానికి సింగపూర్‌లో చాలా డిమాండ్ ఉంది. తమ స్నేహితులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని కోరుకొనే చాలామంది ఇలాంటి ఆహారాన్ని కొనుగోలు చేసి గిఫ్ట్‌గా ఇస్తున్నారట. దీంతో నాస్టీ ఫుడ్‌ బాగా పాపులారిటీ సంపాదించింది. మీకు కూడా ఇలాంటి ఆహారాన్ని తినాలి ఉందా? అయితే కొన్ని రోజులు ఆగండి. ఈ కొత్త కాన్సెప్ట్ గురించి తెలుసుకొని ఎవరో ఒకరు ప్రయోగాత్మకంగా ఇలాంటి నాస్టీ ఫుడ్‌ను అందుబాటులోకి తెస్తారు. 



Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!


Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి