సూపర్ స్టార్ మహేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా సినిమా 'సర్కారు వారి పాట'. మహేష్ బాబుతో ఇంతకు ముందు పని చేసినప్పుడు తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అయితే... 'దూకుడు', 'బిజినెస్ మేన్', 'ఆగడు' సినిమాలు వచ్చి చాలా రోజులైంది. ఏడేళ్ల తర్వాత మళ్లీ మహేష్ బాబు సినిమా రావడంతో మరింత మంచి మ్యూజిక్ ఇవ్వాలని తమన్ ట్రై చేస్తున్నాడు.

 


 

హైదరాబాద్ లో 'వరుడు కావలెను' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత తమన్ ముంబై వెళ్లాడు. అక్కడ 'సర్కారు వారి పాట' సినిమా మ్యూజిక్ వర్క్స్ స్టార్ట్ చేశాడు. ''సర్కారు వారి పాట మ్యూజిక్... డ్రమ్మింగ్, హమ్మింగ్, కుమ్మింగ్" అంటూ తమన్ సినిమా పాటలపై అంచనాలు పెంచేశాడు. ఇటీవల స్పెయిన్ లో మహేష్ బాబు మీద ఒక పాటను చిత్రీకరించారు. అప్పుడు ఎవరో సాంగ్ షూటింగ్ చేస్తున్న సమయంలో చిన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో 'ఇంత ఒక వెయ్యి' అంటూ లిరిక్స్ వినిపించాయి. మహేష్ అభిమానులకు ఆ చిన్న బిట్ విపరీతంగా నచ్చింది. అంతకు మించి సినిమాలో మ్యూజిక్ ఉంటుందని ఆశిస్తున్నారు.

 


 

మహేష్ బాబు సరసన కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఆంజనేయులు', 'శ్రీరస్తూ శుభమస్తు' తర్వాత దర్శకుడితో తమన్ కు మూడో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: ‘మెరుపు మురళి’ ట్రైలర్.. విలేజ్ సూపర్ హీరోగా టొవినో థామస్.. ఇతడో అల్లరి ‘పిడుగు’