రెండు రోజులుగా కొనసాగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో  షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, సన్నీ,మానస్ విజేతలుగా నిలిచారు. వీరందరికీ బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ ''వెంటాడు వేటాడు''. అసలే సరదా పక్కనపెట్టి వైల్డ్ బిహేవ్ చేస్తోన్న ఇంటి సభ్యులు ఈ టాస్క్ లో మరింత రెచ్చిపోయినట్టే కనిపిస్తున్నారు. గ్రూపులుగా విడిపోయిన ఇంటి సభ్యులు ఎటాక్ చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా అన్నంతగా గొడవలు పడుతున్నారు.  తాజాగా కెప్టెన్సీ పదవి కోసం ఇచ్చిన టాస్క్‌ లో శ్రీరామ్, సన్నీ మధ్య పెద్ద గొడవే జరిగినట్టుంది. 






కెప్టెన్సీ టాస్క్ ''వెంటాడు వేటాడు'' లో భాగంగా   పోటీపడుతున్న సభ్యుల బస్తాల్లో ధర్మాకోల్ బాల్స్ ఖాళీ చేయడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో  భాగంగా శ్రీరామ్ “కెప్టెన్ అయి ఉండి నువ్వు చేయాల్సింది ఇదేనా? సన్నీ ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్నా” అనడం సన్నీకి కోపం తెప్పించింది. రా తేల్చుకుందాం అన్నట్టు రియాక్టయ్యాడు సన్నీ. రచ్చంతా సన్నీ-శ్రీరామ్ మధ్య జరిగితే ఫైనల్ గా షణ్ముక్ ఇంటి కెప్టెన్ అయినట్టు టాక్. ఇప్పటికే శ్రీరామ్, విశ్వ, యానీ, రవిని కిచెన్లోనే ఉంచుతా అన్నాడు. మరి షణ్ముక్ కెప్టెన్ అన్నది నిజమేనా అన్నది తెలియాలి.






రెండోసారి వచ్చిన ప్రోమోలో సన్నీ, శ్రీరామ్, మానస్ టాస్క్ లో ఓడిపోగా సిరి, యానీ, షణ్ముక్ పోటీపట్టారు. ఈ టాస్క్ కి సంచాలక్ గా వ్యవహరిస్తున్న జెస్సీతోనూ సన్నీ గొడవపడినట్టు ప్రోమోలో తెలుస్తోంది. 
Also Read: ఓ యాడ్ కోసం ఫస్ట్ టైం లేడీ గెటప్ వేసిన స్టార్ హీరో, లుక్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..
ఇక  శ్రీరామ్ కామెంట్ చేసిన ఇండిపెండెంట్ గేమ్ అనే మాట విషయానికొస్తే హౌజ్ లో ఎవ్వరూ ఇండిపెండెంట్ గేమ్ ఆడటం లేదు. సన్నీ, మానస్, కాజల్… మానస్, ప్రియాంక…రవి,విశ్వ..త్రిమూర్తులు సిరి, జస్వంత్, షణ్ముక్…వీళ్లు ఏ టాస్క్ అయినా కలిసే ఆడుతున్నారు. ఏటొచ్చీ శ్రీరామ్, యానీ మాస్టర్, లోబో అప్పుడప్పుడు సపోర్ట్ ఇస్తూ అప్పుడప్పుడు ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ షోలో ఇంకా నలుగురే అమ్మాయిలు మిగిలారు. ఈ వారం లోబో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం....
Also Read:సామి... సామి... సాంగ్ వచ్చిందిరా సామి!
Also Read: ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీపడుతున్న వారెవరంటే..?
Also Read: సిస్టర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. రజినీకాంత్ మాస్ అవతార్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి