టీఆర్ఎస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘వరి-ఉరి’ పేరుతో దీక్ష ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ దీక్ష చేస్తుండగా.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. వరి వేస్తే ఉరే అంటూ రైతులను భయపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దీక్ష చేస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. వడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కేసీఆర్ వడ్లు ఎలా కొనడో చూస్తానని బండి సంజయ్ సవాలు విసిరారు.






తొలుత గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించిన బండి సంజయ్.. తర్వాత కిసాన్ మోర్చా నేతలతో కలిసి దీక్షలో కూర్చున్నారు. తరతరాలుగా సాంప్రదాయకంగా వరి మాత్రమే సాగు చేస్తున్న రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించకుండా అకస్మాత్తుగా ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదని బండి సంజయ్ తెలిపారు.






Also Read: హుజూరాబాద్ లో లెటర్ల లొల్లి.. దళిత బంధు ఆపింది ఈటలే అంటున్న టీఆర్‌ఎస్‌.. కాదు.. కాదంటున్న బీజేపీ


కౌంటర్ ఇచ్చిన వ్యవసాయ మంత్రి
‘వరి - ఉరి’ పేరుతో దీక్ష చేస్తున్న తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు రాష్ట్ర వ్యవ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌వాలు విసిరారు. బీజేపీ నేత‌లు మోన‌గాళ్లే అయితే యాసంగి పంట‌ను కొంటామ‌ని కేంద్రం చేత ప్రక‌ట‌న చేయించాలని సవాలు విసిరారు. అప్పటిదాకా దీక్ష కొనసాగించాలని నిరంజ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు యాసంగి పంట కొనుగోలుపై ప్రక‌ట‌న చేయించాల‌ని కోరారు. లేదా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, ఎంపీ బండి సంజ‌య్‌లు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.


Also Read: ఈటల గెలిచినా మంత్రి అయ్యేది లేదు... ధరలు పెంచిన బీజేపీని ఎందుకు గెలిపించాలి.... మంత్రి హరీశ్ రావు కామెంట్స్


ఒక వేళ బీజేపీ నేత‌లు కేంద్రాన్ని ఒప్పిస్తే తాను మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి తేల్చిచెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోస‌మే బీజేపీ దొంగ దీక్షలు చేస్తోంద‌ని నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొనేది కేంద్రం.. విధానపరమైన నిర్ణయం చేసేది ఎఫ్‌సీఐ.. మీ కేంద్ర మంత్రే వరి కొనబోమని చెబుతున్నాడు. మరి బీజేపీ నేతలు చేసే దీక్ష ఎవరి కోసం?’’ అని నిరంజన్‌ రెడ్డి ప్రశ్నించారు.


Also Read: Bandi Sanjay On KCR: అబద్ధాలలో కేసీఆర్‌కు ఆస్కార్ ఇవ్వాల్సిందే.. టీఆర్ఎస్ అధినేతపై బండి సంజయ్ సెటైర్!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి