హుజూరాబాద్ లో దళిత బంధు పథకం నిలిచిపోడానికి ఓ పార్టీకి చెందిన అభ్యర్థి కారణమంటూ ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆయన రాసిన లేఖ కారణంగానే దళిత బంధును కేంద్ర ఎన్నికల సంఘం ఆపేసినట్లు ఆ లేఖలో సమాచారం. ఈ లేఖపై వాస్తవాలు బయటపెట్టేందుకు ఏబీపీ దేశం ప్రయత్నించింది. ఏబీపీ దేశం ఫ్యాక్ట్ చెక్ లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘాన్నివివరాలు కోరింది. ఇందులో ఆ లేఖ నకిలీ అని ఈసీ తెలిపింది.
హుజురాబాద్ లో పార్టీలు గెలుపు కోసం ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుంటూ కాక రేపుతున్నారు. ‘దళిత బంధు’పై ఓ పార్టీ అభ్యర్థి ఎన్నికల సంఘానికి రాసినట్లుగా ఓ లేఖ వైరల్‌గా మారింది. ‘హుజురాబాద్ ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్ రూ. 700 కోట్లు ఖర్చు పెడుతోంది, వివిధ పథకాల పేరుతో రూ.వేల కోట్లు గుమ్మరిస్తోంది. అందువల్ల ‘దళిత బంధు’ ఇతర పథకాలు ఆపేలా ఆదేశాలివ్వండి’ అంటూ ఈ నెల 24వ తేదీన ఈసీకి లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో లెటర్ వైరల్ అవుతోంది.
ఈ లేఖపై బీజేపీ, ఈటల అనుచరులు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ నేతలే ఫేక్ లెటర్ సృష్టించి ఈటలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కౌంటర్ గా బీజేపీ కూడా అది ఫేక్ లెటర్ అంటూ మరో లేఖని, అందులో ఉన్న విషయాలను పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను గమనిస్తే అందులో పేర్కొన్న పిన్ కోడ్ జగిత్యాల జిల్లాలోని ఒక మండలానికి చెందిందని అలాంటప్పుడు అది హైదరాబాద్ కి చెందిన అడ్రస్ ఎలా అవుతుందని బీజేపీ పేర్కొంది. అంతేకాకుండా ఆ లేఖపై ఎలాంటి అధికారిక ముద్ర లేకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఐటీ విభాగం పేర్కొంది.
హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్ధులు ఉన్నారు. అన్నీ తానై ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రి హరీష్‌రావు... ఐదు నెలలుగా హుజూరాబాద్‌లో మకాం వేశారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కూడా ప్రచారం చేశారు. దీంతో హోరాహోరీగా టీఆర్‌ఎస్, బీజేపీ ప్రచారం సాగింది. బీజేపీ తరపున ప్రచారంలో మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ తరపున సీనియర్ నేతలు తరలివచ్చారు. వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా హుజూరాబాద్ బైపోల్‌ను భావిస్తున్నాయి పార్టీలు.
Also Read: Huzurabad BJP : రైల్వేస్టేషన్ల అభివృద్ధి.. రైతులకు పెన్షన్లు.. హుజురాబాద్ కోసం బీజేపీ మేనిఫెస్టో !
దళిత బంధు పథకం
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల(SC) కోసం స్వయం-సాధికారత, సామాజిక అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందజేస్తారు. అధికార టీఆర్‌ఎస్.. ప్రభుత్వ నిధులతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష పార్టీల తీవ్ర విమర్శల మధ్య సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని హుజూరాబాద్‌లో ప్రారంభించారు.
Also Read: Huzurabad ByPolls: ఈటల, గెల్లు శ్రీనివాస్.. వీరి బలం, బలహీనతలు ఏంటి?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి