హుజురాబాద్‌లో బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ పక్కాగా అమలు చేస్తామని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈటల రాజేందర్‌ను గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని రైల్వే స్టేషన్స్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే అవసరమున్నచోట ఆర్వోబీల నిర్మిస్తామన్నాు. నియోజకవర్గ పరిధిలో 60ఏళ్ల పైబడిన రైతులకు రూ.3వేల పెన్షన్ అందజేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రైతులకు పెన్షన్ అందించే పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అలాగే అర్హులైన విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి విద్యాలక్ష్మి పథకం ద్వారా సహాయం చేయడం.. బేటీ బచావో, బేటీ పడావో, ఆయుష్మాన్ భారత్ పటిష్ట అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు రక్షిత మంచి నీరు అందిస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపిస్తేనే ప్రజలకు ఉపయోగమని.. ఈటలను గెలిపిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని టీఆర్ఎస్ నేతలు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. అన్ని పథకాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనివని చెబుతున్నారు. ఒక వేళ టీఆర్ఎస్‌ను కాదని.. ఈటలను గెలిపిస్తే పథకాలు అందడం కష్టమన్న రీతిలో అధికార పార్టీ ప్రచారం ఉండటంతో బీజేపీ నేతలు ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేశారు. తెలంగాణలో విపక్ష పార్టీలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హామీలు ఇవ్వలేరు కాబట్టి ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ పథకాలను చేర్చినట్లుగా తెలుస్తోంది.
Also Read : హుజూరాబాద్ లో జోరుగా ప్రచారం... సానుభూతి వర్సెస్ అభివృద్ధి.. గెలుపుకోసం ఎత్తుకుపై ఎత్తులు...
నిజానికి బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ ఎంపీ నియోజకవర్గానికి సంబంధించినవి. ఎంపీలు మాత్రమే ఆయా పనులు చేయించగలుగుతారు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ అభ్యర్థి అయిన ఈటలను గెలిపిస్తే కేంద్ర పరిధఇలోని అభివృద్ధి పనులు చేయిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేనిఫెస్టోను హుజురాబాద్ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.
Also Read: ఇప్పుడు ఏపీలో చీకట్లు.. తెలంగాణలో వెలుగులు ! తెలంగాణ దేశంకన్నా ముందు ఉందన్న కేసీఆర్ !
హుజురాబాద్‌లో ప్రచారం చివరి దశకు వచ్చింది. 30వ తేదీన పోలింగ్ జరగనుంది. తొలి సారిగా 72 గంటల ముందే ప్రచారాన్ని ముగిస్తున్నారు. ఈ కారణంగా బుధవారంతోనే ప్రచార గడువు ముగియనుంది. మరే ఇతర పార్టీ హుజురాబాద్ కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం కనిపించడం లేదు.
Also Read: ప్లీనరీలో కనిపించని హరీష్‌రావు, కవిత ! టీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందా ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి