ఉద్యోగ జీవితంలో ఒత్తిడులు, తరచూ మారే షిఫ్టులు, ఇంటి బాధ్యతలు, పిల్లలు... ఇన్ని పనుల మధ్య కంటి నిండా నిద్రపోవడానికి  చాలా మందికి సమయం దొరకదు. కేవలం నాలుగు లేదా అయిదు గంటలు నిద్రపోయే వారే ఎక్కువ.  అలాంటి వారి అవసరాలు అర్థం చేసుకున్న ఓ హాంగ్ కాంగ్ కంపెనీ ఓ కొత్త సేవను మొదలుపెట్టింది. ఇంతవరకు ఎవరికీ రాని ఆలోచన వారికొచ్చింది. అదే ‘స్లీపింగ్ బస్ సర్వీసు’. ఈ బస్సులు కేవలం నిద్రపోవడానికే. టిక్కెట్ తీసుకుని ఎక్కితే అయిదు గంటల పాటూ హాయిగా నిద్రపోవచ్చు. బస్సు ఎక్కడా ఆగకుండా 47 మైళ్ల పాటూ తిరుగుతూనే ఉంటుంది. అన్నట్టు బస్సు ఎక్కే ముందు పొట్ట నిండా ఫుడ్ పెట్టే బాధ్యత కూడా బస్సు వారిదే. ఈ బస్సు సర్వీసు అక్టోబర్ 21 నుంచి హాంగ్ కాంగ్ లో మొదలైంది. అక్కడ విజయవంతమైతే మిగతా దేశాలకు పాకొచ్చు ఈ కొత్త సేవ. 


ఉలు ట్రావెల్స్... హాంగ్ కాంగ్ లోని ఫేమస్ బస్ సర్వీసు సంస్థ. ఆ సంస్థ బిజినెస్ మేనేజర్ కెన్నెత్ కాంగ్ తన ఫ్రెండ్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టును చూసి ఇలాంటి సర్వీసును మొదలుపెట్టాలని అనుకున్నాడు. ఆ పోస్టులో జర్నీలోనే రెండు మూడు గంటలు గడిచిపోతుందని, రాత్రి పూట నిద్రపోయే సమయం కూడా దొరకడం లేదని’ రాశాడు అతని ఫ్రెండ్. అందుకే జర్నీలోనే నిద్రపోయే అవకాశం కల్పిస్తే బావుంటుందని భావించాడు కాంగ్. అలా పుట్టిందే ‘స్లీపింగ్ బస్’ కాన్సెప్ట్. ఇందులో సాధారణ నుంచి లగ్జరీ వరకు నాలుగైదు రకాల కేటగిరీలు ఉన్నాయి.  ధర ఒక వ్యక్తికి 13 డాలర్ల నుంచి 51 డాలర్ల వరకు ఉంటుంది. టిక్కెట్ బుక్ చేసుకున్న వ్యక్తిని మొదట ఒక రెస్టారెంట్ కు తీసుకెళతారు. అక్కడ పొట్ట నిండా ఫుడ్ పెట్టి బస్సు ఎక్కిస్తారు. ఐ మాస్క్, ఇయర్  ప్లగ్స్ ఇస్తారు. అవి పెట్టుకుని నిద్రపోవడమే. అయిదు గంటల తరువాత `మళ్లీ లేపుతారు. కప్పుకోవడానికి దుప్పట్లు మాత్రం ఎవరివి వాళ్లు తెచ్చుకోవాలి. 
ఫస్ట్ రైడ్ లాంచ్ చేయగానే అన్ని టిక్కెట్లు అమ్ముడైపోయాయి. లాంఛ్ చేసి అయిదు రోజులైనప్పటికీ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 


Also read: అపెండిసైటిస్ ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది?



Also read: చేపలతో తలనొప్పికి విరుగుడు... తరచూ తింటే మైగ్రేన్ మాయం


Also read: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి


Also read: వంటనూనెల్లో ఏది మంచిది? ఏ నూనె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి