మెగాస్టార్ చిరంజీవి, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణంవంశీ మధ్య మంచి అనుబంధం ఉంది. చిరు తనయుడు రామ్ చరణ్ హీరోగా 'గోవిందుడు అందరివాడేలే' తీశారు కృష్ణవంశీ. చిరంజీవితో సినిమా తీయాలనుందని చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు సినిమా తీయలేదు కానీ చిరంజీవితో తన సినిమా కోసం వాయిస్ ఓవర్ చెప్పించుకున్నారు.
Also Read: సర్కారు వారి పాట... ఇంతే ఒక వెయ్యి... లీకయ్యిందిగా!
కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'రంగమార్తాండ'. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్, శివాత్మికా రాజశేఖర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రీసెంట్ గా చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ విషయాన్ని కృష్ణవంశీ ట్వీట్ చేశారు. చిరంజీవికి థాంక్స్ చెప్పారు. మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇస్తున్న సమయంలో తీసిన ఫొటో షేర్ చేశారు.
"నేనొక నటుడ్ని
చిమ్మీరి బట్టలేసుకుని
అట్ట కిరీటం పెట్టుకుని
చెక్క కత్తి పట్టుకుని
కాగితం పూల వర్షంలో...
కీలుగుర్రంపై స్వారీ చేసే
చక్రవర్తిని నేను...
కాలాన్ని బంధించి శాసించే
నియంతని నేను"
"నేనొక నటుడ్ని
నావి కాని జీవితాలకు
జీవం పొసే నటుడ్ని
నేను కాని పాత్రల కోసం
వెతికే నటుడ్ని
వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని
వేషం తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని" చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన డైలాగులు ఇవి.
చిరంజీవి గతంలో పలు సినిమాలు వాయిస్ ఓవర్ ఇచ్చారు. త్వరలో విడుదల కానున్న మోహన్ బాబు 'సన్ ఆఫ్ ఇండియా'కు కూడా ఓవర్ ఓవర్ ఇచ్చారు. చిరంజీవి గాత్రంతో ఆ సినిమా టీజర్ విడుదలైంది. త్వరలో విడుదల కానున్న సినిమాల్లో ఇప్పటికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు రెండు ఉన్నాయి అన్నమాట.
'రంగమార్తాండ'కు వస్తే... 'నక్షత్రం' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఓ మరాఠీ సినిమాకు రీమేక్. అయితే, ఆ సినిమా కథలో ఆత్మను చెడగొట్టకుండా తనదైన శైలి మార్పులను కృష్ణవంశీ చేశారట. ముఖ్యంగా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం పాత్రలు... వారి నటన కొన్నాళ్లపాటు మాట్లాడుకునేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. కృష్ణవంశీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతోగానో ఎదురు చూస్తున్నారు.
Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి
Also Read: బస్ డ్రైవర్ నుండి బాలచందర్ వరకూ... తమిళ ప్రజలనూ... రజనీకాంత్ ఎవ్వర్నీ మరువలేదు!
Also Read: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!
Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?