దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓల్డ్ సీమాపురిలో జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృతి చెందారు. మూడంతస్తుల భవనం పైఫ్లోర్లో మంటలు చెలరేగాయి.
తెల్లవారుజామున 4 గంటల సమయంలో తమకు సమాచారం వచ్చిందని పోలీసు అధికారులు వెల్లడించారు. వెంటనే నాలుగు అగ్నిమాపక వాహనాలు ఘటనస్థలానికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఊపిరాడకపోవడం వల్ల నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.
మృతులను హౌరీ లాల్, రీనా, అషు, రాధికగా గుర్తించారు.ఘటనపై సమాచారం అందుకొని హుటాహుటిన తరలి వచ్చిన అగ్నిమాపక దళాలు.. మంటలను ఆర్పేశాయి. అనంతరం ఇతర సహాయక చర్యలు చేపట్టాయి.
అయితే ఈ ప్రమాద కారకులపై భారత శిక్షాస్మృతిలోని 436, 304A కింద చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!
Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: ఛీ.. యాక్.. ఈ ఆహారాన్ని లొట్టలేసుకుని మరీ తింటారట, ఇది ఏమిటో తెలుసా?
Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!