వివాహేతర సంబంధాలు ఎంతటి అనర్థానికి దారి తీస్తాయో తెలిపే మరో ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇంట్లోని లేదా కుటుంబంలోని వ్యక్తులతోనే సంబంధాలు నెరపడంతో తాజాగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలో చోటు చేసుకుంది. ఇద్దరూ ఉరి వేసుకొని చనిపోవడం స్థానికంగా తీవ్రంగా చర్చనీయాంశం అయింది.
మహబూబ్ నగర్ జిల్లాలో మరిదితో కలిసి ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకద్ర మండలంలోని గోపనపల్లి గ్రామంలో వదిన, మరిదుల మధ్య వివాహేతర సంబంధం కొంత కాలంగా నడుస్తోంది. స్థానిక ఎంపీటీసీ సభ్యుడు ఆంజనేయులు అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఈయన రెండో భార్య 23 ఏళ్ల అర్చన. ఆయన ఫ్యామిలీలోనే వరుసకు మరిది అయ్యే మధు అనే 22 ఏళ్ల వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడి అయింది.
Also Read: Crime News: ఆమెతో కలిసి ఆ రోజు లాడ్జికి వెళ్లాడు.. చంపేశాడా? చచ్చిపోవాలనుకున్నారా?
ఈ విషయం ఇతరులకు తెలియడంతో మనస్తాపానికి గురైన ఆ ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ ఓకే చీరకు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే అర్చన మృతి చెందింది. మరోవైపు, మరిది అయిన మధు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు మెరుగైన చికిత్స కోసం అతణ్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Also Read: అయ్యో.. కనీస సంస్కారం లేదా? ఒళ్లో పసిబిడ్డతో తల్లి ఇబ్బందులు, కనీసం సీటివ్వరా?’ వీడియో వైరల్