కరోనా వ్యాక్సిన్ తీవ్రమైన అనారోగ్యాన్ని తగ్గిస్తుందని, వ్యాధి మరణాలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా కాకుండా ఇతర కారణాల వల్ల వచ్చే మరణ రేటును కూడా ప్రభావితం చేస్తుందా? ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వ్యాక్సిన్ పై వస్తున్న ప్రచారాల సమయంలో ఒక కొత్త అధ్యయనం ఏం చెబుతోంది. కరోనాతో కాకుండా ఇతర వ్యాధుల వలన వచ్చే మరణాలపై ఏం అంటోంది?
దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన కైజర్ పెర్మనెంట్.. స్టాన్లీ జు నేతృత్వంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిపై అధ్యయనం చేసింది. అయితే ఫైజర్(Pfizer)-బయోటెక్, మోడర్నా(moderna), జాన్సన్ అండ్ జాన్సన్(johnson & johnson) కొవిడ్ -19 వ్యాక్సిన్‌లను పొందిన వ్యక్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేసింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారితో పోల్చితే ఇతర వ్యాధుల వలన వచ్చే మరణాల రేటు తగ్గిందని ఈ పరిశోధనలో తేలింది.
కైజర్ పెర్మనెంట్ నిర్వహించిన ఈ అధ్యయనం.. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ)లో ప్రచురితమైంది. డిసెంబర్ 14, 2020 నుంచి జులై 31, 2021 వరకు ఈ అధ్యయనం చేశారు. వ్యాక్సిన్ సేఫ్టీ డేటాలింక్(VSD) సైట్లలో చేరిన సుమారు 11 మిలియన్ల మందిపై ఈ అధ్యయనం జరిగింది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో.. వ్యాక్సిన్ తీసుకొని వారితో పోల్చితే మరణాల రేటు తక్కువగా ఉందని గుర్తించింది.
ఫైజర్(Pfizer) వ్యాక్సిన్ తీసుకున్న వారిలో.. మెుదటి డోసు తర్వాత.. 1,000 మంది వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులలో మరణాల రేటు 4.2 శాతంగా ఉండగా.. రెండో డోసు తీసుకున్న వారిలో3.5 శాతం మరణాల రేటు ఉన్నట్టు పరిశోధనలో తేలింది. వ్యాక్సిన్ పొందని వారిలో మరణాల రేటు 11.1 శాతంగా ఉంది.
మోడర్నా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మొదటి డోసు తరువాత ప్రతి 1,000 మందికి 3.7 శాతం మరణాలు సంభవించగా.. రెండో డోసు తరువాత 3.4 శాతం మరణాలు సంభవించాయి. వ్యాక్సిన్ తీసుకోని వారిలో 1,000 మందిలో 11.1 శాతంగా మరణ రేటు ఉంది. వ్యాక్సినేషన్ చేయని వారిలో 14.7 శాతం మరణాల రేటు ఉంది. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అందుకున్న ప్రతి 1,000 మందిలో 8.4 శాతంగా మరణాల రేటు ఉందని పరిశోధనలో తేలింది.
Also Read: Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి