తెలుగు సినిమాలు 'సర్కారు వారి పాట', 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్' టీజర్స్ రికార్డులను 'రాధే శ్యామ్' తిరగరాసింది. విడుదలైన 24 గంటల్లో రికార్డుల మోత మోగించింది. అయితే, ఇండియా పరంగా చూస్తే టాప్ వ్యూస్ రికార్డుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ప్రభాస్ స్టార్‌డ‌మ్‌ ఎంత ఉందనేది 'రాధే శ్యామ్' టీజర్ మరోసారి నిరూపించింది. యంగ్ రెబల్ స్టార్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఈ టీజర్ 50 మిలియన్స్ మార్క్ చేరుకుంది. ఈ రికార్డును 25.35 గంటల్లో సాధించింది. తెలుగులో ఇదే హయ్యస్ట్ రికార్డ్. దాంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.




ప్రభాస్ లాస్ట్ సినిమా 'సాహో'కు విడుదలైన 24 గంటల్లో 44.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దాన్నీ 'రాధే శ్యామ్' టీజర్ బీట్ చేసింది. 24 గంటల్లో ఈ టీజ‌ర్‌కు 46.6 మిలియన్స్ (యువి క్రియేషన్స్, టీ సిరీస్ యూట్యూబ్ ఛాన‌ల్స్‌) వచ్చాయి. దాంతో తన రికార్డును తానే ప్రభాస్ తిరగరాశారు. తెలుగు వరకూ చూసుకుంటే... 'రాధే శ్యామ్' టీజ‌ర్‌కు విడుదలైన 42.67 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీని తర్వాతి స్థానాల్లో మహేష్ బాబు 'సర్కారు వారి పాట' (23 మిలియన్స్), అల్లు అర్జున్ 'పుష్ప' (22.5 మిలియన్స్), మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' (14.6 మిలియన్స్), ఎన్టీఆర్ కొమరం భీమ్ టీజర్ 'ఆర్ఆర్ఆర్' (14.1 మిలియన్స్), ప్రభాస్ 'సాహో' (12.9 మిలియన్స్), మహేష్ బాబు మహర్షి (11.1 మిలియన్స్) టీజర్లు ఉన్నాయి.


Also Read: టీజ‌ర్‌లో అంతులేని కథ... మీరు గమనించారా?


ఆల్ ఓవర్ ఇండియా చూస్తే... 'రాధే శ్యామ్' టీజర్ వ్యూస్ పరంగా రెండో స్థానంలో ఉంది. ప్రభాస్ సినిమా కంటే ముందు కన్నడ హీరో యష్ 'కె.జి.యఫ్: ఛాప్టర్ 2' టీజర్ ఉంది. విడుదలైన 24 గంటల్లో ఆ టీజర్ 68.8 మిలియన్స్ వ్యూస్ సాధించింది. దాంతో రెండో స్థానంలో నిలిచింది. ఆ ఒక్క రికార్డు కూడా ప్రభాస్ ఖాతాలో చేరి ఉంటే... ఏ లాంగ్వేజ్ చూసుకున్నా ఒక్క రోజులో హయ్యస్ట్ వ్యూస్ సాధించిన టీజర్ రికార్డు ప్రభాస్ పేరు మీద ఉండేది.


Also Read: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!


'రాధే శ్యామ్' టీజర్ సినిమాపై అంచనాలు పెంచిందని చెప్పాలి. ఇందులో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటించారు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి  కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.  తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే... ఇద్దరికీ హిందీలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకని, ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Also Read: ప్రభాస్ వెరీ పాజిటివ్ గురూ... కాదంటారా? అయితే ఓ లుక్కేయండి!


Also Read: 'ఎఫ్ 3' రిలీజ్ డేట్ ఫిక్స్... బొమ్మ ఎప్పుడు పడితే అప్పుడే నవ్వుల పండగ!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి