ప్రభాస్ పుట్టినరోజు కానుకగా 'రాధే శ్యామ్' టీజర్ విడుదల చేశారు. ఇప్పటివరకు స్టిల్స్ చూసుకుని సరిపెట్టుకున్న 'బాహుబలి' అభిమానులకు ఈ టీజర్ కిక్ ఇచ్చింది. ఈ సినిమా మొదలై మూడేళ్లు. టీజర్ చూస్తే సినిమా తీయడానికి అంత సమయం ఎందుకు తీసుకున్నారో అర్థమవుతోంది. ప్రభాస్ స్టయిల్, అద్భుతమైన విజువల్స్... వీటితో పాటు అంతులేని కథను పూర్తిగా చెప్పకుండా అలా అలా పరిచయం చేశారు. అదేంటో మీరూ చదవండి. 

 

విజువల్స్ సూపర్...



 

ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. 'రాధే శ్యామ్' టీజర్ ప్రారంభమైన వెంటనే ప్రేక్షకులకు కలిగే ఇంప్రెషన్... 'విజువల్స్ సూపర్' అని! మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ హాలీవుడ్ స్థాయిలో ఉంది. టీజర్ మొత్తం విజువల్ ట్రీట్. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎర్లీ మార్నింగ్ సిటీని అందంగా చూపించాడు. 

 

ప్రభాస్ స్టయిల్...



టీజర్ మొదలైంది. విజువల్స్ బావున్నాయి. నెక్స్ట్ అందరి లుక్ ప్రభాస్ లుక్ మీద పడింది. బ్లాక్ కలర్ సూట్‌లో ప్రభాస్ స్ట‌యిలిష్‌గా ఉన్నాడు. వాచ్ పెట్టుకోవడం, నిలబడటం ఆ షాట్స్ అన్నీ స్ట‌యిలిష్‌గా ఉన్నాయి. వరల్డ్ మ్యాప్ మీద ఉండే షాట్‌ను బాగా తీశారు. విజువల్స్ బావున్నాయి. ప్రభాస్ స్ట‌యిల్‌గా ఉన్నాడు. టీజర్ బావుంది. అంతేనా? అంటే... జాగ్రత్తగా గమనిస్తే టీజ‌ర్‌లో అంతులేని కథ ఉంది. అదేంటో మీరూ తెలుసుకోండి.

 

ఎమర్జెన్సీని ముందే ఊహించాడు!



సినిమాలో ప్రభాస్ పేరు విక్రమాదిత్య. అతడు చేతి రేఖలు చూసి జాతకం చెప్పే వ్యక్తి. ఈ సంగతులు మనకి ముందే తెలుసు. మరోసారి చెప్పారు. అయితే... అతడి ప్రతిభ ఏంటనేది టీజ‌ర్‌లో చెప్పారు. ఇండియాలో ఎమర్జెన్సీ వస్తుందని ముందే ఊహించిన వ్యక్తిగా విక్రమాదిత్యను పరిచయం చేశారు. 'ద మ్యాన్ హూ ప్రెడిక్టడ్ ఇండియన్ ఎమర్జెన్సీ' అంటూ అతడిపై ఓ పుస్తకం రాసినట్టు చూపించారు. 

 

ప్రేమకు పునాది ఆ ఇంట్లోనే?


టీజ‌ర్‌లో ఓ ఇల్లు చూపించారు కదా! హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు పునాది ఆ ఇంట్లోనే పడింది. కృష్ణాష్టమి సందర్భంగా ప్రభాస్, పూజ హెగ్డే స్టిల్ ఒకటి రిలీజ్ చేశారు. అందులో పియానో ఉంది. ఆ పియానో టీజర్‌లో కనిపించింది. 

 

టీజ‌ర్‌లో హీరోయిన్‌ను చూశారా?


టీజ‌ర్‌లో హీరోయిన్‌ పూజా హెగ్డేను చూశారా? ఎక్కడుంది... మాకు కనిపించలేదే!? అనుకుంటున్నారా?? నిజమే... టీజ‌ర్‌లో పూజా హెగ్డే లేదు. కానీ, ఆమె స్పర్శ ఉంది. పూజా హెగ్డే చేతిని ప్రభాస్ పట్టుకోవడం చూపించారు. ఇక, పూజా హెగ్డే పాత్ర పేరు కూడా ఉంది. 'VA+P' అని పేర్లు చెక్కారు కదా! అంటే... వికమాదిత్య, ప్రేరణ అని! సినిమాలో పూజా హెగ్డే పేరు ప్రేరణ. 

 

పునర్జన్మల కథ!



టీజర్ చూస్తే... 'రాధే శ్యామ్' పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన కథ అని అర్థం అవుతోంది. ప్రభాస్ కిటికీలోంచి బయటకు చూస్తాడు కదా! ఆ దృశ్యాన్ని నిశితంగా గమనిస్తే... టన్నెల్ లోంచి ఒక ట్రయిన్ వస్తుంది. ఇంతకు ముందు ప్రభాస్, పూజా హెగ్డే ఓల్డ్ ట్రయిన్ లో ఉన్న స్టిల్ రిలీజ్ చేశారు. ఈ రెంటిడిని బట్టి ఇది పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన కథగా అని ఊహించవచ్చు.  

 

ప్రభాస్ ఫైట్ కూడా ఆ ఇంట్లోనే!


టీజ‌ర్‌లో చూపించిన ఇంట్లో ఫైట్ కూడా ఉంది. టీజ‌ర్‌ స్టార్టింగులో టేబుల్ మీద ఓ షాట్ ఉంది. అందులో బుక్ మీద చిన్న బొమ్మ ఉంది. టీజ‌ర్‌ చివర్లో ప్రభాస్ చేతికి రక్తం ఉంది. అది ఓ బొమ్మ మీద పడినట్టు చూపించారు. స్టార్టింగులో, ఎండింగులో చూపించిన బొమ్మ ఒక్కటే. సో... ఫైట్ కూడా ఆ ఇంట్లోనే అన్నమాట.

 

సముద్రానికి... సమయానికి సంబంధం ఏమిటి?



'రాధే శ్యామ్'లో సముద్రం, ఓడతో పాటు పాటు సమయానిది కూడా కీలక పాత్రే. ఫస్ట్ లుక్ లో ప్రభాస్, పూజ హెగ్డే జంటగా కౌగలించుకుని ఉన్నారు. ఇద్దరి చుట్టూ నీరు చేరినట్టు డిజైన్ చేశారు. ఇప్పుడు టీజ‌ర్‌లోనూ సముద్రాన్ని చూపించారు. గులాబీ నీటిలో పడినట్టు... లైట్ హౌస్ కూలడం... వంటివన్నీ చూపించడం సముద్రం పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయడమే. ఇక, టేబుల్ క్లాక్, రైల్వే క్లాక్ చూస్తే... టైమ్ కూడా కీరోల్ ప్లే చేస్తున్నట్టు ఉంది.

 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి