'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆయన ఒప్పుకుంటున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథలే. భారీ బడ్జెట్, ఇంట్రెస్టింగా ఉన్న కథలనే ఒప్పుకుంటున్నాడు ప్రభాస్. 'రాధేశ్యామ్' సినిమాలో ప్రేమికుడిగా.. 'ఆదిపురుష్' సినిమా శ్రీరాముడిగా.. 'సలార్'లో సైనికుడిగా మనల్ని మెప్పించడానికి రెడీ అవుతున్నాడు రెబల్ స్టార్. ఇక 'ప్రాజెక్ట్ K'లో ఆయన ఎలా కనిపిస్తాడా..? అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది.


Also Read: ప్రభాస్ సినిమాల స్పెషల్ షోస్‌తో థియేటర్లు హౌస్‌ఫుల్.. ఫ్యాన్స్ హంగామా.. ఇవిగో వీడియోలు


దానికి చిత్రబృందం పరోక్షంగా సమాధానం చెప్పింది. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో 'రాధేశ్యామ్' చిత్రబృందం టీజర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చింది. అలానే 'ప్రాజెక్ట్ K' టీమ్ ప్రభాస్ క్యారెక్టర్ గురించి ఓ హింట్ ఇచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఓ కొత్త ఒరవడిని తెచ్చిన సూపర్ హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు. 'ప్రాజెక్ట్-K' సెట్స్‌ పైకి మిమ్మల్ని స్వాగతిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నామంటూ రాసుకొచ్చింది. 


ఈ పోస్ట్ తో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించబోతున్నాడని.. ఇన్ డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేశారని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తయింది. నవంబర్ నుంచి సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు రెండు వందల రోజులు కేటాయించినట్లు తెలుస్తోంది. 


అంటే సినిమాలో ఆయన రోల్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. భారీ బడ్జెట్ తో.. అత్యాధునిక టెక్నాలజీతో విజువల్ వండర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దడానికి రెడీ అవుతున్నారు. సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఈ సినిమాకి క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు.