'ఈశ్వర్' సినిమాతో మొదలైన ప్రభాస్ ప్రయాణం 'ఛత్రపతి' తో తిరుగులేని మాస్ ఫాలోయింగ్ వచ్చేలా చేసింది.  మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, డార్లింగ్ క్లాస్ హిట్స్‌ అయితే...బిల్లా మాస్ హిట్ గా నిలిచింది. క్లాస్-మాస్-ఫ్యామిలీ అనే తేడా లేకుండా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బాహుబలితో ఏకంగా ప్రభాస్ ఇమేజ్ మారిపోయింది. లోకల్, నేషనల్ దాటి ఇంటర్నేషనల్ స్థాయికి చేరింది ప్రభాస్ ఇమేజ్. అందుకే బాహుబలికి ముందో లెక్క... ఆ తర్వాత మరో లెక్క పాన్ ఇండియా స్టార్ వచ్చాడని చెప్పు  అంటూ డైలాగ్స్ మారుమోగిపోతున్నాయ్. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా పలు థియేటర్లలో స్పెషల్ షోస్ తో ఫ్యాన్స్ హంగామా మాటల్లో చెప్పలేం...





బెంగళూరు అభిమానుల సందడి ఇక్కడ చూడండి  






భీమవరంలో మిర్చి, హైదరాబాద్‌లో బిల్లాతో పాటు పలు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30 థియేటర్లలో ప్రభాస్ సినిమాల స్పెషల్ షోస్ తో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.





ఏ PRల సహాయం లేకుండా ప్రత్యేక షోలు ప్లాన్ చేశామని సోషల్ మీడియాలో పేర్కొన్నారు అభిమానులు. 






తెలుగురాష్ట్రాల్లో ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్ సహా పలుచోట్ల ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆ ఫొటోస్  సోషల్ మీడియాలో షేర్ చేశారు.






ప్రభాస్ ప్రస్తుతం ముంబైలో ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్' షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబ సభ్యులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు చార్టర్డ్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు తిరిగొచ్చిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


మరో స్పెషల్ ఏంటంటే ప్రభాస్ సినిమాలు ప్రదర్శించడమే కాదు... రెబల్ స్టార్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ని కూడా థియేటర్లలో ప్రదర్శించేందుకు ప్లాన్ చేశారు.  #Prabhas, #HappyBirthdayPrabhas, #PrabhasFans, #PrabhasBirthdayCelebrations సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. సేవా కార్యక్రమాలు, బైక్ ర్యాలీలు, కేక్ కటింగులు సందడే సందడి..