యంగ్ రెబల్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఇండస్ట్రీ వర్గాల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గతంలో తమ అభిమాన హీరోకి శుభాకాంక్షలు చెప్పాలంటే పెద్ద పెద్ద కటౌట్లు, పాలాభిషేకాలు చేసి హడావుడి చేసేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పరిధి పెరిగిన తర్వాత ఎంచక్కా ఎవరి స్టైల్లో వాళ్లు ఐ లవ్ యూ డార్లింగ్ అని చెబుతున్నారు. ఇందులో భాగంగా కడపకు చెందిన యువ ఇంజినీర్ నరసింహ శ్రీచరణ్..ప్రభాస్ కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాడు. 

మొత్తం 550 రూబిక్ క్యూబ్స్ తో డార్లింగ్ బొమ్మ తయారు చేశాడు. కేవలం ఈ వరుస పేర్చేందుకే 17 గంటలు పట్టిందట. నాలుగున్న అడుగుల హైట్, నాలుగు అడుగుల వెడల్పులో క్యూబ్స్ ని పేర్చాడు శ్రీచరణ్. 

అయితే యువ ఇంజినీర్ చేసిన మొదటి ప్రయత్నం కాదిది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాథ్, వినాయకచవితి, ఇండిపెండెన్స్ డే ఇలా ప్రత్యేక రోజులు  ఏమొచ్చినా తనలో ప్రతిభను మరింత మెరుగుపర్చుకుంటున్నాడు. సెప్టెంబరు 2 న  పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా 550 రూబిక్ క్యూబ్స్‌ను ఉపయోగించి, దాదాపు 24గంటలకు పైగా శ్రమించి పవన్‌ చిత్రాన్ని తీర్చిదిద్దాడు.

 డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బర్త్ డేకి శ్రీచరణ్ ఇచ్చిన బహుమతి

రియల్ హీరో  సోనూసూద్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా

వినాయక చవితి సందర్భంగా క్యూబ్స్ తో లంబోదరుడు

ఇండిపెండెన్స్ డే సందర్భంగా

Also Read: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..Also Read: 'సెన్సార్ బోర్డ్ యాక్సెప్ట్ చేయదు కానీ ఇంగ్లీష్ కిస్ పెట్టేవాడిని..' యానీ మాస్టర్ తో సన్నీ ఫన్.. Also Read: 'మా నాన్న పనైపోయిందని అన్నారు.. కానీ కాలర్ ఎగరేసేలా చేశారు..' పూరి కొడుకు స్పీచ్ అదిరిపోలా..!ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి