ఆకాష్ పూరి, కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం 'రొమాంటిక్'. అనిల్ పాదూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పూరి జగన్నాథ్ అందించారు. ఈ సినిమా అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ సినిమా ఈవెంట్ లో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి ఇచ్చిన స్పీచ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. 


Also Read:మహర్షి మహేష్ యోగి ఆశ్రమంలో సమంత.. ఫ్యాన్ గర్ల్ అంటూ పోస్ట్..


తన తండ్రి గొప్పదనం గురించి, అతడు ఎదుర్కొన్న విమర్శల గురించి ఆకాష్ పూరి మాట్లాడారు. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఎక్కడో నర్సీపట్నం నుంచి వచ్చి ఇండస్ట్రీకి ఎంతో చేశారని ఆకాష్ చెప్పుకొచ్చారు. సాఫీగా సాగిపోతున్న తమ లైఫ్ లో ఒక వ్యక్తిని నమ్మి మోసపోవడం వలన తన తండ్రి ఇబ్బంది పడ్డాడని చెప్పారు. ఆ సమయంలో పూరి పనైపోయిందని.. ఇక సినిమాలు చేయలేడని.. రొటీన్ సినిమాలు చేసుకుంటున్నాడని కామెంట్స్ చేశారని అన్నారు. తన తండ్రిని ఎవరైనా కామెంట్ చేస్తే ఇంటికెళ్లి మరీ కొట్టాలనిపించేదని ఎమోషనల్ అయ్యారు. ఫైనల్ గా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో కాలర్ ఎగరేసేలా చేశాడని ఆకాష్ చాలా గర్వంగా చెప్పుకొచ్చారు. 


అలానే తను హీరోగా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు అయిందని.. ఈ మూడేళ్లలో తనపై కూడా చాలా కామెంట్స్ వచ్చాయని.. 'వీడేం హీరో.. బొంగు అవుతాడు వీడు హీరో' అని విమర్శలు చేశారని చెప్పారు. కానీ కచ్చితంగా అందరూ మెచ్చే హీరో అవుతానని ఎంతో నమ్మకంగా చెప్పారు. తన తండ్రి కాలర్ ఎగరేసేలా సక్సెస్ అవుతానని ఆకాష్ స్టేజ్ పై చెప్పుకొచ్చారు. ఆకాష్ మాట్లాడుతున్నంతసేపు ఎంతో జోష్ గా, మొహమాటం లేకుండా మాట్లాడడంతో స్టేడియం మొత్తం అరుపులు వినిపించాయి. 


Also Read: అటు మహేష్.. ఇటు ప్రభాస్.. అబ్బో ఈ బ్యూటీ డిమాండ్ మాములుగా లేదుగా..


Also Read: 'మగాడు.. గిగాడని మాట్లాడొద్దు..' ప్రియాంకపై విరుచుకుపడ్డ విశ్వ..


Also Read: 'మోర్ పవర్ టు విమెన్'.. గుడ్ న్యూస్ చెప్పిన విష్ణు..


Also Read: 'నాట్యం' సమీక్ష: నృత్యం బావుంది! కానీ..


Also Read : ప్రధాని మోదీకి మొరపెట్టుకున్న నటి, క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్


Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి