బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో కంట్రోల్ (ఎన్‌సీబీ) సోదాలు చేసింది బాంద్రాలోని అనన్యా ఇంటికెళ్లిన అధికారులు తనిఖీలు చేసినట్లు సమాచారం. యువనటితో ఆర్యన్ డ్రగ్స్ గురించి వాట్పాప్‌లో చాటింగ్ చేసినట్టు ఎన్సీబీ అధికారులు ఇటీవల ముంబై కోర్టులో తెలిపారు. ఆ యువనటి  అనన్య పాండే అని టాక్. ఈ మేరకు ఆమె ఇంట్లో దాడులు చేసిన అధికారులు విచారణకు కూడా పిలిచారు. NCB నివేదికల ప్రకారం, అనన్య పాండేతో పాటు, ఆర్యన్ ఖాన్ సోదరి సుహానా ఖాన్ పేరు కూడా డ్రగ్స్ చాట్‌లో కనిపించింది. అనన్య పాండే ఇంటిపై దాడులు చేసిన తర్వాత ఎన్‌సిబి బృందం షారుఖ్ ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. బాలీవుడ్ లో జరుగుతున్న ఈ హడావుడిపై ఇప్పుడు టాలీవుడ్ లోనూ చర్చ మొదలైంది. ఎందుకంటే అనన్య పాండే.. విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లోతెరకెక్కుతోన్న ‘లైగర్’ సినిమాలో హీరోయిన్. 


పూరీ జగన్నాథ్ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు, విచారణ ఎదుర్కొని ఈ మధ్యే క్లీన్ చిట్ పొందారు. పూరీ జగన్నాథ్ నుంచి సేకరించిన రక్తం, వెంట్రుకలు, గోళ్ల శాంపిళ్లలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎస్ పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని తెలంగాణ ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసు ఛార్జిషీట్‌లో పేర్కొంది. 2017 జులైలో పూరి జగన్నాథ్ నుంచి ఎక్సైజ్ శాఖ నమూనాలు సేకరించింది. ఈ నమూనాలపై గతేడాది డిసెంబర్‌ 8న ఎక్సైజ్‌శాఖకు ఎఫ్ఎస్ఎస్ నివేదికలు సమర్పించింది. ఇప్పుడు ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న మూవీలో అనన్య పాండే నటించడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ మూవీలో భాగమైన చార్మీ  పేరు కూడా టాలీవుడ్ డ్రగ్స్ కేసు జాబితాలో ఉంది. దీంతో అందరూ ఒకటే బ్యాచా అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


పబ్ నుంచి గెంటేశారట: ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న అనన్య పాండే ఏ బ్యాగ్రౌండ్ లేని హీరోయినేం కాదు..అలనాటి హీరో చుంకీ పాండే కూతురు. 2019 లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే వరుస ఆఫర్లు దక్కించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ మూవీతో పాటూ టాలీవుడ్ లో 'లైగర్' లో నటిస్తోంది. హీరోయిన్ గా ఇప్పటి వరకూ కెరీర్ టర్న్ అయ్యే హిట్టందుకోపోయినా పార్టీలు, పబ్బుల్లో మాత్రం అమ్మడి జోరు ఓ రేంజ్ లో ఉంటుంది.  ఆ మధ్య స్నేహితులతో కలసి నైట్ క్లబ్ లో పార్టీ చేసుకోవాలని వెళ్లిన అనన్య పాండేను ఆ నైట్ క్లబ్ సిబ్బంది గెంటేశారని తెలిసింది. సదరు నైట్ క్లబ్ యాజమాన్యం దీని గురించి వివరణ ఇచ్చింది కూడా. 24 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారిని అనుమతించేది లేదని, అందుకే  అనన్యా పాండేని లోనికి రానివ్వలేదని చెప్పారు.


షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, సైఫ్  కుమార్తె సారా అలీ ఖాన్,  బిగ్ బి మనవరాలు నవ్య నవేలి నందా, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్  వీళ్లంతా ఒకటే ఏజ్ గ్రూప్. అందరూ కలిసే  క్లబ్బు పబ్బు అంటూ షికార్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు ఆర్యన్ ఖాన్ సహా మరికొంత మంది ఫ్రెండ్స్ తో కలసి ఎంజాయ్ చేస్తుంటుంది అనన్యా పాండే.  క్రూయజ్ నౌకలో రేవ్ పార్టీ చేసుకుంటూ ఆర్యన్ ఖాన్ పోలీసులకు పట్టుబడడంతో ఈ డొంకంతా కదులుతోంది. మరి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో లింకుల్లా ఇంకా ఎవరెవరి పేర్లు వెలుగు చూస్తాయి. విచారణకు హాజరయ్యేదెవరు.. క్లీన్ చిట్ పొందేదెవరో.. వెయిట్ అండ్ సీ. ఏదేమైనా అనన్యా పాండే ఇంటిపై NCB దాడుల వ్యవహారంతో టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు లింకులు ఉన్నాయా అనే చర్చ కూడా జరుగుతోంది. 


Also Read: బిగ్ బాస్ హౌస్ లోకి లోబో రీ-ఎంట్రీ ..యదవనయ్యా అన్న షణ్ముక్-కన్నీళ్లు పెట్టుకున్న సిరి…!
Also Read: అనారోగ్యం వల్ల కొద్దిసేపే చూస్తానన్న ఉప రాష్ట్రపతి ..సినిమా మొత్తం అయ్యేవరకూ కదల్లేదట
Also Read: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా రాజు ఎవరి కూతురో తెలుసా?
Alos Read: తమన్నా ఔట్-అనసూయ ఇన్..హాట్ యాంకర్ అంతకుమించి అనిపిస్తుందా..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి