తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి విషయంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.  పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై జరిగిన దాడులన్నీ పోలీసుల కనుసన్నల్లోనే జరిగాయని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో విధ్వంసం సృష్టించిన వారిలో పది మంది పోలీసులు ఉన్నారని ప్రకటించారు. పార్టీ ఆఫీసులో ఉన్న సీసీ కెమెరాల్లో అన్నీ దృశ్యాలు నమోదయ్యాయని స్పష్టం చేశారు. తాము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని.. కోర్టున సైతం ఆశ్రయిస్తామని ప్రకటించారు. 


Also Read : పోలీసులకు సిగ్గు లేదా?, నీ కథ ఏంటో చూస్తా..! ఆ పని చేస్తే జగన్‌కి మేమూ సహకరిస్తాం: చంద్రబాబు


డీజీపీ కార్యాలయంలో పీఆర్వోగా పనిచేస్తున్న వ్యక్తి టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిలో ఉన్నారని ఫోటోలను మీడియాకు పయ్యావుల కేశవ్ విడుదల చేశారు.  ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఆయన చేతే నారా లోకేశ్ పై కేసు పెట్టించారని మండిపడ్డారు. డీజీపీ సరైన చర్యలను ఇప్పుడు తీసుకోకపోతే... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టం చేశారు. రిటైర్ అయిన తర్వాత డీజీపీ కూడా సామాన్యుడిగానే మారిపోతారని... జరుగుతున్న పరిణామాల్లో కిందస్థాయి పోలీసుల తప్పు లేదని... పోలీస్ అధికారులదే మొత్తం తప్పని స్పష్టం చేశారు.


Also Read: టీడీపీ నేత పట్టాభి అరెస్ట్.. తలుపులు బద్దలుకొట్టి మరీ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు..


ఐపీఎస్ అధికారిగా చేసిన ప్రమాణం ఏమైందని డీజీపీని పయ్యావుల ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని అన్నారు. ఇంటికి వెళ్లి మీ భార్యా పిల్లలను అడగాలని మీరు చేస్తున్నది కరెక్టేనా అనేది అడిగి తెలుసుకోవాలని సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు సిఫార్సుచేయాలన్నారు. లేకపోతే తామే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని... ఆధారాలన్నింటినీ కోర్టుల్లో పెడతామన్నారు. 


Also Read: నిన్నటి వరకూ బూతులు .. ఇప్పుడు దాడులు ! ఏపీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయా ? 


మరో వైపు ముఖ్యమమంత్రి జగన్ పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో తనను టీడీపీ నేతలు బోషడికే అని తిట్టారని.. ఆ తిట్టుకు అర్థం కూడా విడమర్చి చెప్పడంపై పయ్యావుల కేశవ్ ఆస్చర్యం వ్యక్తం చేశారు.  అసలైన సమస్యను తప్పుదోవ పట్టించేందుకే సీఎం ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఇదే పదాన్ని మీ మంత్రులు గతంలో అనలేదా? అని ప్రశ్నించారు. బ్రిటీష్ కాలంలోనే బోసడీకే అని పిలిచే సంప్రదాయం ఉన్నట్టు కొందరు చెపుతున్నారని.... ఆ పదానికి అర్థం 'మీరు బాగున్నారా' అని అంటూ మరికొందరు భాష్యం చెపుతున్నారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. డ్రగ్స్ సమస్యపై మాట్లాడకుండా ఇతర అంశాలను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసి.. భావితరాల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. 


Also Read : మోహన్‌బాబు అరెస్ట్‌కు రెండు రాష్ట్రాల్లో ఫిర్యాదులు ! ఎందుకంటే ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి