కరోనా సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్లలో అడుగుపెట్టేందుకు ఏ హీరో సాహసం చేయలేదు. ఓటీటీలకే ఓటేశారు. అయితే ఏదేమైనా థియేటర్లో వచ్చి తీరాల్సిందే అని ఫిక్సైన నాగచైతన్య తన లవ్ స్టోరీ మూవీని థియేటర్లలో తీసుకొచ్చాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 24 విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. తొలి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఈ సినిమా దాదాపు నెలరోజులవుతున్నా ఇప్పటికీ కలెక్షన్లు బాగానే ఉన్నాయంటున్నారు. దర్శక -నిర్మాతలకే కాదు థియేటర్ల యజమానులకు లాభాలు తెచ్చిపెడుతోంది 'లవ్ స్టోరీ'. ఇంతకీ సాయిపల్లవికి -AMBమాల్ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే లవ్ స్టోరీ సినిమా ఏఎంబీ థియేటర్ లో కోటి రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకుందట. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత AMB లో ఇవి రికార్డు స్థాయి కలెక్షన్స్ అనే చెప్పాలి.
'లవ్ స్టోరీ' విడుదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకు మొత్తం 251 షో లు AMBలో ప్రదర్శించారు. ఇప్పటి వరకు మొత్తంగా 48, 233 మంది ఈ సినిమా చూశారు. ఏఎంబీ మల్టీ ప్లెక్స్ లో ఇంత భారీ మొత్తంలో వసూళ్లు దక్కించుకున్న సినిమాలు చాలా అరుదు. ఆ ఘనత సొంతం చేసుకుంది చైతూ-సాయిపల్లవి నటించిన 'లవ్ స్టోరీ'. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించింది. అందుకే ఒక్క థియేటర్ లో కోటికి మంచి వసూళ్లు దక్కించుకుని స్టార్ హీరోలకు ధీటుగా కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. అంతెందుకు త్వరలో ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కు సిద్ధం అయినా ఇంకా థియేటర్లలో జనాలు లవ్ స్టోరీని చూసేందుకు ఆసక్తి చూపిస్తూనే ఉన్నరంటే అదీ ఈ మూవీ మ్యాజిక్.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు సాయి పల్లవి మరియు నాగ చైతన్యల కాంబినేషన్ కు మంచి మార్కులు పడ్డాయి. ముందుగా విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఏషియన్ సంస్థ నిర్మించింది.
Also Read: 'ఫుల్లీ అండ్ మళ్లీ లోడెడ్', సాయి ధరమ్ తేజ్ పై హరీశ్ శంకర్ ట్వీట్ వైరల్
Also Read: రెచ్చిపోయిన ప్రియ..ఇచ్చి పడేసిన సన్నీ… హౌస్ లోకి లోబో రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
Also Read: చిన్నారి ప్రాణం కాపాడిన సోనుసూద్.. నిజంగా దేవుడే!
Also Read: నాగబాబు గొప్ప నటుడేమీ కాదు.. చిరు, పవన్ లేకపోతే..: కోట శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు
Also Read: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా రాజు ఎవరి కూతురో తెలుసా?
Also Read: కోర్టుకెక్కిన సమంత.. ఇక వాళ్లకు చుక్కలే!
Also Read: అవినాష్ పెళ్లి.. తప్పు జరిగిపోయిందంటూ రామ్ ప్రసాద్ కామెంట్స్, ఆ వీడియో లీక్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి