టెలివిజన్‌ నటితో ఓ బిజినెస్ మెన్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా తెలిసింది. నటి ఫిర్యాదుతో ఆ వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు.


ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన విమానంలో ఓవర్ హెడ్ స్టోరేజ్ నుంచి బ్యాగులు తీసుకుంటున్న ఓ నటిని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వేధింపులకు గురిచేశాడు. అక్టోబర్ 3 న ఢిల్లీ నుంచి ముంబైకి ప్రయాణించానని నటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. విమానం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ టెర్మినల్‌లో ల్యాండ్ అయిన తర్వాత ఓవర్ హెడ్ స్టోరేజ్ తెరిచి హ్యాండ్‌ బ్యాగు తీసుకునేందుకు నటి లేచింది.  అయితే పక్క సీట్లో ఉన్న ఓ బిజినెస్ మెన నటి నడుం పట్టుకొని ఒక్కసారిగా ఒళ్లోకి లాక్కున్నాడు. ఆమె ప్రతిఘటించడంతో అబద్ధాలు చెప్పాడు. పురుషుడు అనుకొని అలా చేశానని ఆమెకు సారీ చెప్పాడు.


అయితే ఈ ఘటన తర్వాత ఆ నటి తన ఇంటికి వెళ్లింది. విమానంలో జరిగిన విషయాన్ని.. విమానయాన సంస్థకు మెయిల్ చేసింది. తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యాపారవేత్త వివరాలను బయటకు చెప్పాలని కోరింది. తాము అలా వివరాలను బయటకు చెప్పలేమని విమానయాన సంస్థ చెప్పుకొచ్చింది. అవసరమైతే.. పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించింది. ఆమె అకోటబర్ 4న ముంబయిలోని సహర్ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది.  నటి ఫిర్యాదు ఆధారంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఆ వ్యాపారవేత్తను పోలీసులు ఈనెల 14న అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. మరో 24 గంటలపాటు కోర్టు కస్టడీ విధించింది.
 
అయితే తనకు విమానంలో ఎదురైన చేదు అనుభవాన్ని.. ఆ నటి బహిర్గతం చేసింది. వ్యాపారవేత్త చేసిన పనికి ఎంతో భయపడినట్లు తెలిపింది. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని వ్యాపారవేత్త కుటుంబసభ్యులు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు చెప్పింది. ‘ఆ ఘటనతో వణికిపోయాను. అతడి భార్య, మరో వ్యక్తి నా ఇంటికి వచ్చి ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలన్నారు. నా ఇంటి అడ్రస్‌ కూడా తెలిసిపోయింది. మళ్లీ ఎవరైనా నా దగ్గరకు వస్తారేమోనని భయంగా ఉంది.’ అంటూ నటి ఆవేదన వ్యక్తం చేసింది.


Also Read: Lakhimpur Kheri Case: ఎందుకింత ఆలస్యం..? దీన్నొక అంతులేని కథగా మార్చకండి: సుప్రీం


Also Read: Aryan Khan Bail News: ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ షాక్.. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు


Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!


Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి