నైరుతి రుతుపవనాల తిరోగమనంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. 23వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు తిరోగమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 26న బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలలో ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉన్నందువలన నైరుతి రుతుపవనాలు మొత్తం దేశం నుంచి తిరోగమించుకునే అవకాశాలున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు ఆగ్నేయ ద్వీపకల్పంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తిరోగమన రేఖ.. ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగుతుంది. ఈ కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.


ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రాలో  ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశల్లో కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే ఛాన్స్ ఉంది. రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.






రుతుపవనాల కాలం ముగిసినా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబరులో ఢిల్లీలో అత్యధిక వర్షాలు నమోదయ్యాయి. రుతుపవనాలు ఆలస్యంగా విరమించడం, అనేక ప్రాంతాల్లో అల్పపీడనాలు ఏర్పడటం వల్లే అక్టోబరులో విపరీతమైన వర్షాలు కురిసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా ఈ నెలలో నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పడతాయి. ఈ కారణంగావర్షాలు తక్కువగా నమోదవుతాయి. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దీంతో దేశంలోని తూర్పు ప్రాంతాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి.  గత వారంలో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావంతో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి.


Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!


Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి