మొన్నటి వరకు సమంత-అక్కినేని నాగ చైతన్యల విడాకుల గురించి మీడియా, సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. వారి విడాకులకు కారణం ఇదేనంటూ.. ఎవరికి తోచిన విధంగా వారు కట్టు కథలు చెప్పుకుంటూ ప్రజలను నమ్మించారు. విడాకుల తీసుకున్న బాధలో ఉన్న సమంతను ఆ వార్తలు ఎంతగానో నొప్పించాయి. తనపై తప్పుడు కథనాలు ఆపాలంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించినా కొన్ని టీవీ, యూట్యూబ్ చానళ్లు సమంతపై ప్రతికూల వార్తలు ప్రసారం చేస్తూనే ఉన్నాయి. దీంతో సమంత కీలక నిర్ణయం తీసుకుంది. 


తన పరువుకు భంగం కలిగించేలా కథనాలను ప్రసారం చేశారంటూ సమంత మూడు యూట్యూబ్ చానళ్లు, ఒక అడ్వకేట్ మీద కూకట్‌పల్లి కోర్టులో పరువు నష్టం దావా పిటీషన్ దాఖలు చేసింది. తనను కించపరిచే విధంగా కథనాలు, అభ్యంతరకర వీడియోలును ఆయా చానళ్లలో ప్రసారం చేశారని, వాటి వల్ల తన గౌరవానికి భంగం వాటిల్లిందని ఆమె పిటిషన్‌లో తెలిపింది. ఈ కేసును కోర్టు బుధవారమే విచారించనున్నట్లు తెలిసింది. ఆమె తరపున హైకోర్టు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపించనున్నారు. 


Also Read: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా ఎవరి కూతురో తెలుసా? మూవీకి ఈ రేంజ్ ప్రమోషన్ అందుకేనా?


నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న రోజు నుంచి పలు ప్రముఖ టీవీ చానళ్లు, యూట్యూబ్ చానళ్లు ఆమెపై ఎన్నో తప్పుడు కథనాలను ప్రసారం చేశాయి. ఆమె విడాకులకు కారణాలు ఇవేనంటూ దారుణమైన అంశాలను ప్రస్తావించారు. ఆమె వస్త్రధారణ నచ్చకపోవడం, వేరేవరితోనో అఫైర్ ఉండటం వంటి రకరకాల కారణాలు చెబుతూ సమంతను కించపరిచారు. బాధ్యతగా ఉండాల్సిన పలు టీవీ చానళ్లు కూడా ఈ అంశానికి అధిక ప్రాధాన్యమిస్తూ రచ్చ చేశాయి. అయితే, సమంత ఆ చానళ్లపై కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కథనాలను సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో సమంత టీమ్ ఉన్నట్లు సమాచారం. మరి సమంత దాఖలు చేసిన కేసుపై కోర్టు ఏ తీర్పు ఇస్తుందో చూడాలి.  


Also Read: సన్నీ-ప్రియ మధ్య మరింత అగ్గి రాజేసిన 'బంగారు కోడిపెట్ట'


Also Read: బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న శ్రీలంక సన్సేషనల్ సింగర్ యొహానీ



Also Read: అక్కినేని బ్రదర్స్ పై అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...



Also Read:  బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ తేదీ ఖరారు.. మరో వీడియో వదిలిన ‘ఆహా’



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి