నందమూరి బాలకృష్ణ.. ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) అంటూ వచ్చేస్తున్నారు. ‘ఆహా’లో టెలికాస్ట్ కానున్న టాక్ షోలో బాలయ్య తన విశ్వరూపం చూపిస్తారని, ఆయనలోని మరోకోణాన్ని ఈ షోలో ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ తరహాలో టీవీ చానెళ్లలో కాకుండా.. బాలయ్య కొత్తగా ఓటీటీ షో ద్వారా బుల్లి తెరను షేక్ చేయడానికి వస్తున్నారు. దీంతో అభిమానుల ఆనందానికి అవథులే లేవు. ఇందులో బాలయ్య ‘సింహా’ సినిమా గెటప్‌లో కనిపిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ షో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో చెప్పలేదు. ఇటీవలే ఈ షోకు సంబంధించి గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో బాలయ్యతోపాటు నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. బాలకృష్ణను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ షోకు సంబంధించి త్వరలోనే ఒక ప్రోమో విడుదల కానుంది. దీనికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.
బుధవారం తాజాగా ఈ షో ప్రసారమయ్యే తేదీని ‘ఆహా’ ప్రకటించింది. నవంబరు 4 నుంచి ‘ఆహా’లో స్రీమింగ్ కానుందంటూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. దీని తర్వాత ప్రోమో కూడా విడుదల చేయనున్నట్లు తెలిసింది. బాలయ్య మొదటి టాక్ షో కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఒక స్టార్ తన తోటి స్టార్స్‌తో కబుర్లు చెబుతుంటే ఏ అభిమానికి చూడాలని అనిపించదు చెప్పండి. అందుకే నిర్మాతలు వెండితెరపై బోలెడంత క్రేజ్ ఉన్న బాలకృష్ణను ఎంపిక చేసుకున్నారని అనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ‘ఆహా’ తాజాగా విడుదల చేసిన ఆ వీడియో కూడా చూసేయండి.
Also Read: సన్నీ-ప్రియ మధ్య మరింత అగ్గి రాజేసిన 'బంగారు కోడిపెట్ట'
ఈ షో ప్రత్యేకత ఏమిటంటే.. ఇప్పటి వరకు బాలయ్యతో ఒక్క సినిమా కూడా నిర్మించని ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ టాక్ షో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక్కో ఎపిసోడ్‌కు రూ.40 లక్షలు చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ షోలో మొత్తం 12 ఎపిసోడ్స్ ఉంటాయని, అంటే సుమారు రూ.5 కోట్లు వరకు బాలయ్యకు దక్కనుందని తెలిసింది. బాలకృష్ణ ఇప్పటివరకు సినిమాలకు కూడా అంత భారీ పారితోషకం తీసుకోలేదు. దీన్ని బట్టి బాలయ్యకు ఈ టాక్ షో మంచి క్రేజ్‌తోపాటు క్యాష్ కూడా లభించనుంది. నవంబర్ 4 నుంచి ప్రసారం కానున్న తొలి ఎపిసోడ్‌లో బాలకృష్ణ ఎవరిని ఇంటర్వ్యూ చేయనున్నారన్నది ఆసక్తిగా ఉంది. ఈ మధ్యే ఈ షో లాంచ్ వేడుక నిర్వహించారు. ఈ షోలో చిరంజీవి, రామ్ చరణ్ కలసి పాల్గొంటారని, ఆరంభ ఎపిసోడ్‌లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ పాల్గొటారని సమాచారం. మిగతా ఎపిసోడ్స్‌లో నాగార్జున, చైతూ, అఖిల్ కలసి రానున్నట్లు తెలిసింది. అందుకే.. ఈ షోను ‘బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్’ అని పేర్కొంటున్నారు.
Also Read: 'మా'లో అంతా జోకర్లే.. ఆర్జీవీ ట్వీట్‌కు మంచు మనోజ్ స్ట్రాంగ్ రిప్లై
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి