తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతున్న బూతులు విని బీపీ తెచ్చుకుని తమను అభిమానించేవారు దాడులు చేశారని సీఎం జగన్ చెప్పారు. జగనన్న తోడు కింద వడ్డీ విడుదల చేసే కార్యక్రమంలో ఆయన రాష్ట్రంలో తాజా పరిస్థితులపై స్పందించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మట్లాడుతున్న భాషపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో హుందాగా వ్యవహరించానని.. ఎలాంటి బూతులు మాట్లాడలేదని.. కానీ ఇప్పుడు ప్రతిపక్షం దారుణమైన భాషను మాట్లాడుతోందన్నారు. 


Also Read : టీడీపీ ఆఫీసులపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ


" ఎవరూ మాట్లాడని.. ఎవరూ మాట్లాడలేని అన్యాయమైన మాటలు.. అన్యాయమైన బూతులు..  బహుశా ..నేను ప్రతిపక్షంలో ఉన్నాను.. కానీ ఏ రోజు కూడా.. ఎప్పుడు కూడా ఇలాంటి అన్యాయమైన మాటలు మాట్లాడలేదు. అంతటి దారుణమైన బూతులు మట్లాడుతున్నారు. ఆ బూతులు వాళ్లు తిడతారు.. దాని మీద రియాక్షన్.. మనల్ని అభిమానించే వాళ్లో.. ప్రేమించే వాళ్లో ఆ టీవీ న్యూస్ చూసి .. ఆ బూతులు వినలేక.. ఆ తిట్లు వినలేక బీపీ వచ్చి.. మనపై ఆప్యాయత చూపించే వాళ్లు .. రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. ఆ రకంగా వైషమ్యాలు క్రియేట్ చేసి.. ఆ రకంగా కావాలని తిట్టించి.. కావాలని వైషమ్యాలు క్రియేట్ చేయించి.. తద్వారా రాజకీయంగా లబ్దిపొందాలనే ఆరాటం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది"  అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. 


Watch: విమర్శలు చేస్తే దాడులు చేస్తారా.. ప్రభుత్వంపై అచ్చెన్న సీరియస్‌


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులు జరిగిన తర్వాత ప్రెస్‌మీట్ నిర్వహించి తమకు సంబందం లేదని.. తమ పార్టీ వారు కాదని ప్రకటించారు. టీడీపీ వాళ్లే దాడి చేసుకుని ఉంటారని హోంమంత్రి సుచరిత ప్రకటించారు. అయితే సీఎం జగన్ మాత్రం .. తమను బూతులు తిట్టినందున అభిమానించే వాళ్లే బీపీ వచ్చి దాడి చేసి ఉంటారని వ్యాఖ్యానించారు. 


Also Read:  ఏపీలో కాకరేపుతున్న పట్టాభిరామ్ కామెంట్స్ .. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు


ఓ వర్గం మీడియా కూడా ప్రభుత్వం చేస్తున్న పనులను జీర్ణించుకోలేకపోతోందని జగన్ మండిపడ్డారు. వ్యవస్థలను మ్యానేజ్ చేసి కోర్టులకు వెళ్లి అభివృద్ధి పనును అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాజకీయంగా ఉనికి చాటుకునేందుకు విపక్ష పార్టీలు ఇలాంటి పనులు చేస్తున్నాయని విమర్శించారు.


'జగనన్న తోడు' కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల వడ్డీ సొమ్మును బ్యాంక్‌ ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు. 16.36 కోట్లును అకౌంట్స్‌లో వేశారు. తొలి విడతలో 4.5 లక్షల మంది చిరు వ్యాపారులకు నగదు జమ చేశారు. మొత్తంగా ఇప్పటివరకు 9.05 లక్షల మందికి 950 కోట్లను అందజేసింది ప్రభుత్వం. కార్యక్రమం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లార చూశానని అందుకే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. 
 






Also Read : నెల్లూరులో టీడీపీ నేతల నిరసన.. లాక్కెళ్లి అరెస్ట్‌లు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి